Pawan Fans

Pawan Fans

Share

we support janasena in order to bring political accountability and Transpernency in administration..vote for glass tumbler...vote for janasena

01/30/2020

సినిమాలు చేయడం తప్పు అని పార్టీ ని వీడడం బాధాకరం ఒక వైపు పార్టీ ని ఇంకో వైపు ఫ్యామిలీ ని వ్యక్తిగత సిబ్బంది ఇంకా పార్టీకి సంబందించిన అన్ని ఖర్చులను భరించటానికి మన నాయకుడికి తండ్రి నుంచి కానీ అక్రమంగా కానీ వేళా కోట్లు రాలేదు కదా ఏదో ఉన్నదాంట్లో ఇన్నిరోజులు నెట్టుకొచ్చారు ఇంకా పార్టీని ముందుకి తీసుకు వెళ్ళటానికి తనకు వేరే ఏ రకమైన వ్యాపారాలు కానీ ఆదాయాలు కానీ లేవుగా ఉన్నదల్లా తన వృత్తి నటన మాత్రమే దాని ద్వారా మాత్రమే డబ్బు సంపాందించుకోగలడు అది అందరికి తెలిసిన విషయమే పూర్తిగా ప్రజల కోసం జీవితం అంకితం చేస్తాను అన్నమాటకు పవన్ కళ్యాణ్ గారు కట్టుబడే ఉన్నారు ఒక సీఎం కూడా 7 రోజులు ప్రజల కోసం కేటాయించలేదు కదా ,ఉదయం షూటింగ్ ముగించుకొని మధ్యాహ్నం కి కార్యకర్తల తో మీటింగ్ వచ్చారు ఇంతకంటే ఇంకేం కావాలి ,ఎక్కడ ఏ సమస్య వచ్చిన ముందుట్టున్నారు ఇంకేం కావాలి ఆ విషయాన్ని మనమే అర్తం చేసుకోలేక పొతే ఎలాగ

కాబట్టి జనసైనుకులందరికి విన్నవి ఎవరు కూడా మన ధైర్యాన్ని కోల్పోవద్దు మనమే పార్టీకి బలం అన్న మాట అందరు పెట్టుకోండి

01/16/2020

అంగ భలం.. అర్ధ భలం.. మీడియా భలం.. ఇవేమీ లేకుండా ఒక్క నీతి నిజాయితీ తో గెలవడం కల్ల.. దానికి ఉదాహరణే కనీసం పవన్ కూడా గెలవకపోవడం.. సినిమాలు చేసుకుంటూ అస్సలు నియోజికవర్గంలో ఉండని బాలయ్యని గెలిపించారండి మన జనం.. అన్ని ప్రాంతాలు తిరుగుతూ.. అస్సలు అవినీతి ఆరోపణలు లేని.. ఆపదలో ఉన్నోడికి సాయం చేసే వాడిని ఓడించారండీ ఇదే జనం.. కేవలం తన నిజాయితీని.. ప్రజల్లో చదువుకున్న వాళ్ళని నమ్మి మొన్న ఎలక్షన్స్ కి వెళితే జనం ఓట్లు వేశారా..??? చదువుకున్నోళ్ళే ఓట్లు వెయ్యనపుడు.. ఇప్పట్లో జనం మారతారని ఆశించడం కూడా తప్పే.. కేంద్ర భలాన్ని తీసుకోవడం పార్టీ కి మన కార్యకర్తలకి ఎంతో మేలు.. ఇప్పుడు రూరల్ లెవల్లో కూడా కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి భయం లేకుండా పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయ్.. ఈ నిర్ణయం జనసేనకు ఓ శుభపరిణామం.. లెక్కలు బొక్కలు తీసేవాళ్ళు ఏ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారో తెలిసి కూడా వాళ్ల మాటలు పట్టించుకోవడం మూర్ఖత్వం..

08/28/2019

Comman dp for senani birthday

08/13/2019

జనసేన సైనికులరా మేలుకొందాం ఇప్పటికైనా....

రాజకీయ ప్రత్యర్థులు మన పార్టీ ఉనికిని ప్రశ్నిస్తున్నారు....

నాయకుడి చిత్తశుద్ధిని గేలి చేస్తున్నారు......

ఏడాదికో రెండు సినిమాలు చేస్తే వంద కోట్లు ఒళ్ళోకొచ్చే భోగాన్ని వదులుకుని వచ్చిన యోగి లక్ష్యాన్ని అవమానిస్తున్నారు.....

తన సుఖం కోసం కాక జనం కోసం ఏదైనా చేయాలనే తపనను చంపే ప్రయత్నం చేస్తున్నారు.......

మనం ఏం చేయలేమా ?

నిస్సహాయంగా చూస్తూ మార్పు వద్దని వేడుక చేద్దామా.....

మళ్ళీ ఓటుకు పదో పరకో విదిల్చే ఎన్నికల కోసం ఎదురు చూద్దామా......

ఇది మన పార్టీ. జనహితం కోసం నమ్మకం పునాదులపై ఏర్పడ్డ పార్టీ.

మనమే నిలబెట్టుకుందాం...ఆర్థిక ఆసరాను అందిద్దాం....

ఎక్కువ వద్దు మిత్రమా....

నువ్వు కొనే సినిమా టికెట్ లో సగం డబ్బులు చాలు....

మల్టీ ప్లెక్సుల్లో చిరుతిండి నువ్విచ్చుకునే నిలువుదోపిడీలో ఓ అర్థ భాగం చాలు....

ఓ ప్లేట్ పానిపూరి / ఓ పిజ్జా / క్వార్టర్ మందు / బిర్యానీ పార్సెల్ / బ్యూటీ పార్లర్ బిల్లు / షాపింగ్ లో టి షర్ట్ / బెనిఫిట్ షో టికెట్ / హీరో బ్యానర్ కు ఖర్చు పెట్టే పైసలు ఇలా ఎన్నో.....

వీటిలో ఏదో ఒక్కటి మన భవిష్యత్తు కోసం ఒక్క రోజైనా వదిలేసి దాన్నే చందాగా ఇద్దాం .....

అదే కొండంత భరోసా అవుతుంది.

మార్పు కోసం పరితపిస్తున్న జనసేన నాయకుడికి ఊతకర్రగా మారుతుంది.

మనల్ని వెలుగు వైపు నడిపిస్తుంది.

ఇది యువతగా మనం గుర్తించాల్సిన బాధ్యత .....

చినుకులు వరదగా మారతాయో లేదో తెలియదు కాని మనం పార్టీకి అందించే ఆపన్న హస్తాలు ఖచ్చితంగా మన మనోబలాన్ని రెట్టింపు చేసి రాబోయే ఎన్నికలకు ఊపిరినిస్తాయి....

ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వడం కోసం చేతులు కలపండి ....

మనమిచ్చే విరాళం అవినీతి అధికారం పాలిట గరళంగా మారేందుకేనని గుర్తించండి.

ట్వీట్లే కాదు ఓట్లు కూడా వేస్తాం

ట్రెండింగ్ తో పాటు డొనేషన్స్ కూడా చేద్దాం

సేనానికి సపోర్ట్ గా మనం కాక ఎవరు బాధ్యతగా నిలబడతారు.
ఆలోచించుకో మనసారా ఒకసారి

అఫిషియల్ డొనేషన్స్ లింక్

https://www.janasenaparty.org/donations

జై జనసేన
జై హింద్ ✊

JanaSena Donations Online donation via Net Banking, Credit Card, Debit Card, Wallets (e.g. MobiKwik, Airtel Money, Freecharge,Ola Money etc.), UPI (Unified Payment Interface), Sending Cheque or Demand Draft.

Photos from Pawan Fans's post 05/02/2019

Our party office mangalagiri!!!

04/14/2019

మొట్టమొదటిసారి
తెలుగు మీడియా నిన్న పవన్ కళ్యాణ్ ని సాక్షి తో సహా గొప్పగా చూపించాయి.
అన్ని డిబేట్ లలో పవన్ వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తి మీడియా ఉనికిని చాటుకున్నాయి.
భీమవరం లో వైసీపీ, గాజువాక లో వైసీపీ, టీడీపీ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని క్లియర్ గా తెలిసిన, కొంతమంది మనమూ డబ్బులు పంచుదామా అని పవన్ కి ఫోన్ చేస్తే, ఆయన ఎట్టి పరిస్థితుల్లో నూ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు. గెలిచిన ఓడినా పర్లేదు.మనం విలువలను కాపాడాలి , వాళ్ళలా దిగజారో ద్దు అని.దీంతో డబ్బులు పంచిన వైసీపీ, టీడీపీ వాళ్ళు సైతం పవన్ ను మెచ్చుకుని , మనం గెలిచినా ఓడినట్లే అన్న భావన తమ వర్గీయులతో అన్నారట.ఈ విషయాలను టీవీ డిబేట్ లలో చెపుతూ ప్రజలలో చైతన్యం కోసం మార్పుకోసం పవన్ లాంటి వ్యక్తి నడుం కట్టడాన్ని దేశ రాజకీయాలలో జనసేన కొత్త ఒరవడి సృష్టి0చి ప్రజలలో దీర్ఘకాలిక మార్పుని తీసుకొస్తుంది అని అన్నాయి. ఏ డిబేట్ లలో కూర్చున్న వాళ్లంతా కూడా జనసేన రాష్టం లో ఎక్కడా కూడా ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదు అన్న నిజాన్ని ఒప్పు కున్నాయి. అలాగే మీడియా వాళ్ళు, వైసీపీ టీడీపీ వాళ్ళు డబ్బులు పంచారు కాబట్టి వాళ్ళ ఓట్లు ఎక్కువశాతం డబ్బులు తీసుకుని వేసినవని, జనసేనకి పడిన ఓట్లన్నీ నోటుకు అమ్ముడు పోని ఓటర్లని నిర్ధారణకొచ్చారు.
దీంతో జనసేన కి ఓటు వేసిన ప్రతిఒక్కరు స్వచ్చందంగా ఓటివేసిన ఓటు విలువ తెలిసిన , నోటుకు అమ్ముడుపోని మనుషులని తెలుస్తుంది. ఇలాంటి మార్పు తీసుకురావడానికి కష్టపడిన, పవన్ వెంట నడిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.
అలాగే ఎలక్షన్స్ అయిపోగానే అన్ని పార్టీల వారు పార్టీలలో అంచనాలతో గడిపారు.కానీ జనసేన వాళ్ళు మాత్రం ప్రజల్లోకి వెళ్లి పోయారు.12వ తేదీన జె డి లక్మి నారాయణ గారు మత్యకారుల గ్రామాలలో తిరిగి వారి సమస్యలు తెలుసుకుంటూ, పవన్ ఒక గుడికి 1.32 కోట్ల డబ్బు ఇచ్చి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని భోజనాలు ఒడ్డిస్తూ మొదలుపెట్టారు. పుంగనూరు MLA ఇచ్చిన మాట ప్రకారం గెలిచినా ఓడిన బోరు బావి మెషిన్ కొంట అన్నారు ఎలక్షన్స్ అయిన తర్వాత రోజే 1.5 కోట్లు పెట్టి బోరు బావి వేసే మెషిన్ కొన్నారు.
ఇలాంటి కార్యక్రమాలను కూడా కామెంట్ చేసే కుక్కలు ఇంకా మారాలి.
మార్పు మొదలవడం అంటే ఇదే...

సమాజాన్ని మార్చే పార్టీ
గెలిచినా ఓడినా
జై జనసేన.✊✊

04/05/2019
03/26/2019

డియర్ జనసైనికులు...
ఒక్క 2 నిముషాలు ఈ పోస్ట్ చదవండి 🙏🙏

ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు,
అతను సినిమా చేస్తా అంటే ఇప్పుడే బ్లాంక్ చెక్ ఇస్తా, ఎంతైనా రాసుకోమని చెప్పండి,

అని చెప్పిన *పోసాని కృష్ణ*

నిన్న పవన్ కళ్యాణ్ డబ్బు కోసమే వచ్చాడు అన్నట్లు గా మాట్లాడాడు...

భార్య చనిపోయినప్పుడు మూడు వేల అద్దె కొంప లో ఉన్న నాకు ,
ఇంటికి వచ్చి ,పది లక్షలు ఇచ్చి,
దేశం లో ఎక్కడైనా వెళ్లి మంచి కథ రాసుకొని రమ్మని చెప్పి పంపాడని చెప్పిన *చిన్నికృష్ణ*,

నిన్న వచ్చి కనీసం ఆకు వేసి అన్నం పెట్టలేదు ఆ మెగా ఫ్యామిలి అన్నాడు...

ఇప్పటివరకు నా ఆత్మ పవన్ కళ్యాణ్ అని చెప్పిన *కోన వెంకట్*,
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక దుష్ట శక్తి అంటున్నాడు..

జగన్ 16 నెలల జైల్ జీవితం అప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చిన *షర్మిల* గారు ఈ రోజు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు..

ఇక్కడే మన జనసైనికులు సహనం కోల్పోయారు..

జగన్ మాస్టర్ ప్లాన్ ని గమనించలేక పోయారు..

ఎస్ ఇది పక్కా స్కెచ్ తో నడుస్తున్న ప్లాన్...

గమనించండి..

గత శుక్రవారం జగన్ నామినేషన్ వేసి తన 31 కేసుల బుక్లెట్ ని విడుదల చేశాడు..

మనం దానిని శనివారం నాడు బాగా ట్రోల్ చేసాము..

అన్ని పోస్ట్లు పెడితే కేసుల గురించి, ఒక్క జఫ్ఫా కుడా మన పోస్టు లోకి వచ్చి డిబేట్ చెయ్యలేదు..

అది వాళ్లకు అందిన ఆర్డర్...

మనం ట్రోల్ చెయ్యడం ఎక్కువ కాగానే,
ఈ పోసాని,చిన్నికృష్ణ వచ్చేసారు...
మనం ఆ కేసుల గురించి పక్కన పెట్టి, వాళ్ళను ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టాము..

వాళ్ళు గతం లో మాట్లాడిన వీడియో లు పెట్టి ,వాళ్ళు కుడా ,పేమెంట్ స్టార్లు అని బయట పెట్టేసాము..

అది ఫెయిల్ అయ్యే సరికి ఈ రోజు షర్మిల గారిని తెచ్చారు..

ఇప్పుడు మనం ఈవిడ ని ట్రోల్ చెయ్యాలి,
మళ్ళీ కేసులు పెట్టాలి అన్నది జగన్ ప్లాన్..

ఇక్కడే మనం బాగా ఫూల్స్ అవుతున్నాం..

మనం డైవర్ట్ అయ్యాం..

మనల్ని డైవర్ట్ చేస్తున్నారు..

మనం జగన్ కేసుల గురించి జనాల్లోకి తీసుకుని వెళ్దాం..

ఈ కుక్కలు మొరుగుతూనే ఉంటాయి...

వీటి అరుపులకి సమాధానం చెప్తూ పోతే, మనం మన గమ్యం చేరుకోలేము..

వాటిని అలాగే వదిలెయ్యండి..అరుస్తూనే ఉంటాయి..

అరిచే కుక్కలు, కొరకవు...

అవి పవన్ కళ్యాణ్ కాలి గోటి మీద వెంట్రుక కూడా పీకలేవు.

మనకు చాలా తక్కువ టైం ఉంది..

టీడీపీ మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది...

ఇక వైసీపీ యొక్క ,జగన్ యొక్క నేర చరిత్రను జనం లోకి తీసుకెళదాం..

ప్రజలు అర్థం చేసుకుంటారు...తప్పకుండా..

ఒక్కో కేస్ వివరాలు ,గూగుల్ లో సెర్చ్ చేసి ,పోస్ట్లు పెట్టండి,
ప్రజలకి చెప్పండి..

మధ్యలో ఈ మొరిగే కుక్కల అరుపులకి సమాధానం మనం ఏప్రిల్ 11 న ఓట్ల రూపం లో ఇద్దాం..

జనసైనికులారా !
కుక్కల అరుపులు పక్కన పెట్టి,
జనసేన సిద్ధాంతాలు, మానిఫెస్టో,
జగన్ యొక్క నేర చరిత్ర ప్రచారం చేయండి...
🙏🙏🙏🙏

జై_జనసేన
ఓట్ ఫర్ గ్లాస్

Want your organization to be the top-listed Government Service in Chicago?
Click here to claim your Sponsored Listing.

Address


Chicago, IL

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm