Chevireddy Harsh*th Reddy
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Chevireddy Harsh*th Reddy, Politician, Tummalagunta, Tirupati.
State YSRCP Student Wing Working President for Zone-4 (Chittoor, Tirupati, Annamayya, SPS Nellore and Prakasam Districts) | Joint Chittoor District YSR Congress Party Student Wing President.
18/06/2026
చంద్రగిరి నియోజక వర్గం పరిధిలోని తిరుపతి రూరల్, పాకాల మండలంకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంట విషాదం చోటు చేసుకుంది. ముందుగా రణధీర్ పురం పంచాయతీకి చెందిన చంద్రగిరి నియోజక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షులు తుంటి సుధా యాదవ్ తండ్రి రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి తుంటి వెంకటయ్య ఇటీవల మృతి చెందారు. ఆ ఇంట జరిగిన దశ దిన కర్మ క్రియలకు హాజరైన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆయన చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సి.గొల్లపల్లి గ్రామంలోని మాజీ వార్డు సభ్యులు బి. పుండరీకం తల్లి క్రిష్ణమ్మ ఇటీవల మరణించడంతో ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే పాకాల ఎంపీటీసీ సురేఖ ఇటీవల మృతి చెందడంతో ఆ ఇంటి దగ్గర జరిగిన దశ దిన కర్మ క్రియలకు హాజరై నివాళులు అర్పించారు.
*thReddy
15/06/2026
వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు హర్షిత్‌రెడ్డి శుభాకాంక్షలు
చంద్రగిరి, ఎర్రావారిపాళెం మండలాలకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలోని పార్టీ కార్యాలయంకు చేరుకున్న నేతలకు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రగిరి మండలం రంగంపేటకు చెందిన మాజీ ఉప సర్పంచ్ మోనీష్‌రెడ్డి, ఎర్రావారిపాళెం మండలం యల్లమంద గ్రామంకు చెందిన విద్యార్థి విభాగం ఎగ్జీక్యూటీవ్ మెంబర్ శ్రీకాంత్‌లకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
14/06/2026
చిన్నగొట్టిగల్లు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు నక్కా హరినాథ్ తండ్రి చొక్కలింగం ఇటివల అనారోగ్యంకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పరామర్శించారు. భాకరాపేట వడ్డిపల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
*thReddy
14/06/2026
ఎర్రావారిపాళెం మండలం బోడేవాండ్ల పల్లి పంచాయతీ పడమట వడ్డిపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు, వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడైన రెడ్డిశేఖర్, జ్యోత్సల కుమారుడు నామకరణ మహోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం ఆ దంపతులు ఇచ్చిన ఆతిథ్యం పార్టీ నాయకులతో కలసి స్వీకరించారు.
*thReddy
12/06/2026
చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ర్యాలీ. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద భారీగా చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు. నిరసన ర్యాలీకి హాజరైన చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీ పత్రాలను తగలబెట్టిన వైఎస్సార్‌సీపీ నాయకులు. 'చెట్టుమీద కొంగ. చంద్రబాబు దొంగ.. వెన్నుపోటు ప్రభుత్వం.. మాకొద్దు.. సూపర్ సిక్స్.. సూపర్ మోసం.. అబద్దాల బాబు.. మాకొద్దు..' అంటూ నినాదాలతో హోరెత్తించిన పార్టీ నేతలు, కార్యకర్తలు. అనంతరం ప్రభుత్వం చేతకాని తనం, మోస పూరిత హామీలను ఎండగడుతూ భారీ ర్యాలీ.
*thReddy
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండేళ్లుగా మోసం చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన ప్లకార్డులు, మేనిఫెస్టో పుస్తకాలను దహనం చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సూచనలతో చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
*thReddy
04/06/2026
చంద్రబాబు పాలనకు రెండేళ్లు...
ప్రజల వెన్నుపోటుకు రెండేళ్లు..
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ హామీల వర్షం కురిపించారు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికొదిలేశారు.. రెండేళ్లు పూర్తైనా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు అమలు కాలేదు.. నిరుద్యోగులు, మహిళలు, రైతులు, విద్యార్థులు ఎదురుచూస్తున్న పథకాలు ఇప్పటికీ నెరవేరలేదు.. అబద్ధపు ప్రచారాలు, అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురిచేసిందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తు చేస్తూ జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో ఉధ్యమించనున్నట్టు ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన సూచనల మేరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ క్యాడర్ మొత్తం తరలి రావాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ’చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు‘ పోస్టర్లను పార్టీ నేతలతో కలసి ఆవిష్కరించారు.
*thReddy
03/06/2026
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట పంచాయతీ పరిధిలో నివాసముంటున్న యచ్చం బాలముని ఇటీవల మరణించారు. ఆయన దశదిన కర్మక్రియలు జరగడంతో ఆ ఇంటికివెళ్లిన రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి బాలముని చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనతరం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు.
*thReddy
03/06/2026
నెన్నూరులో గంగమ్మ జాతరకు సారె సమర్పణ.
రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామంలో జరుగుతున్న నడివీధి గంగమ్మ జాతరకు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నుంచి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలతో సారెను సమర్పించారు. రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సారెను తీసుకురాగా గ్రామస్తులు, జాతర నిర్వాహకులు ఎదురేగి స్వాగతం పలికి అమ్మవారికి సమర్పించి దర్శనం చేయించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. నెన్నూరు గ్రామంలోని పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి ఆత్మీయ విందును స్వీకరించారు.
*thReddy
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Tummalagunta
Tirupati
517502