Naveen Kumar Reddy BRS
Ex ZPTC Chairman, Mahabubnagar BRS Leader
05/01/2024
*మొబైల్ క్రీడలు మానండి*
*శారీరక మానసిక దృఢత్వం కోసం క్రీడలు ఆడండి*
*షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్* *మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి*
క్రీడలు మానసిక శారీరక దృఢత్వానికి తోడ్పడుతాయనీ వాటిని శారీరక శ్రమతో ఆడాలే తప్ప మొబైల్ ఫోన్లో ఆడడం సరికాదని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. నియోజక వర్గంలోని చౌదర్ గూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో సర్పంచ్ భూపాల చారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటును బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించడం వల్ల నైపుణ్యమైన క్రీడాకారులను గుర్తించడం జరుగుతుందని అన్నారు. వారికి తగిన సౌకర్యాలు కల్పించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా గ్రామాల్లో యువత ప్రోత్సహించబడతారనీ అదే విధంగా క్రీడల ద్వారా స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయనీ అంతే కాకుండా క్రీడల ద్వారా మానసిక శరీరపరమైన దృఢత్వం ఏర్పడుతుందనీ, తద్వారా చదువుల్లో కానీ ఏ రంగాల్లో పనిచేయడానికి అయినా ఉల్లాస ఉత్సాహం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎల్కిచర్ల సర్పంచ్ భూపాలచారి మాట్లాడుతూ క్రీడలు మానసిక శరీరక ఆరోగ్యానికి తోడ్పడుతాయని మంచి స్నేహపూర్వకమైన సంబంధాలు మెరుగుపడతాయి ఆనాటి కాలంలో శరీరక క్రీడలు ఎక్కువగా ఆడేవారనీ తద్వారా మనుషులు దృఢంగా ఉండి తమ తమ పనులను యాక్టివ్ గా చేసుకునేవారని అన్నారు. కానీ ఇప్పటి కాలంలో ఎవరిని చూసినా మొబైల్ లో మునిగిపోయి క్రీడలు కూడా మొబైల్ లోనే ఆడడం జరుగుతుందని అన్నారు. తద్వారా మానసిక రుగ్మతలు చిన్న సమస్యలు వచ్చినా ఆ తట్టుకోలేని స్థితికి వెళ్లి ఆత్మహత్యలకు దారితీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రావుల మంగమ్మ సర్పంచ్ భూపాల చారి మాజీ సర్పంచ్ గౌస్ కొందుర్గు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి జిల్లెడు చౌదరిగుడా బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు ఆఫీస్ జబ్బర్ జిల్లెడు సర్పంచ్ బాబురావు ఘనపూర్ సర్పంచ్ శివ గుట్ట రాజు,మామిడిపల్లి ఎంపిటిసి కట్న మాదవి రవీందర్,శివ చారి,ఆర్ చెన్నయ్య ఆర్ యాదయ్య బి రామచంద్రయ్య ఆర్గనైజర్, ఎస్.డి గౌస్, కనక అంజి కనక శేఖర్, బోలా సత్యం, రవి, బోయ యాదయ్య, రావుల శ్రీకాంత్, రావుల శ్రీనివాస్ బియా శివ గ్రామస్తులు ఎర్ర రత్నయ్య ఎర్ర భీమయ్య సల్మాన్ కుమార్ నాగయ్య భీమ్ రాజ్ కే, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు..
30/11/2023
*మళ్లీ అంజయ్యదే హవా..!*
*మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి*
*కొత్తూరు ఉమ్మడి మండలంలో విస్తృత పర్యటన*
మళ్లీ ఎమ్మెల్యే అంజయ్యనే భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడని ప్రజలు టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. గురువారం ఎన్నికల సమయంలో మజీద్ మామిడిపల్లి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ఆయన కొత్తూరు ఉమ్మడి మండలంలో పలు గ్రామాలను పర్యటించి ఓట్ల పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా ఈ ఉమ్మడి మండలంలో కారు హవా నడుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈ ప్రాంతంలో ఓట్లు గల్లంత కావడం ఖాయమని ఎమ్మెల్యే బరిలో భంగపాటు తప్పదని పేర్కొన్నారు. నియోజక వర్గంలో ఎమ్మెల్యే అంజయ్య చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే పార్టీ గెలుపుకు కారణం కాబోతున్నాయని అన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యే అంజయ్య ప్రజా ఆశీర్వాదం ప్రజాబలం ఉందని పేర్కొన్నారు. దాదాపు కాంగ్రెస్ ఖాళీ అయిందని టిఆర్ఎస్ ఫుల్ గా ఉందని చమత్కరించారు. ప్రజలు సాయంత్రం లోపు తమ ఓటు హక్కు వినియోగించుకుని కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేకు హ్యాట్రిక్ గెలుపు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి దంపతులతో పాటు స్థానిక సర్పంచ్ ఉమా ఎంపీటీసీ మాధవి రవీందర్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు.. కేపీ
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Modallaguda
Shadnagar
509216