CLN Raju
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CLN Raju, Journalist, Kukatpalli.
28/01/2026
* మహారాష్ట్రలో ఘోరం
* విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం
* బారామతిలో కుప్పకూలిన అజిత్ పవార్ విమానం
* విమానం ల్యాండ్ అవుతుండగా దుర్ఘటన
* బారామతిలో ఓ సభకు వెళ్తుండగా ప్రమాదం
* ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఆరుగురు మృతి చెందినట్లు DGCA నిర్ధారణ
09/01/2026
అమరావతిపై జగన్ స్టాండ్ మారలేదా..?
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ఇంకా గందరగోళంలోనే ఉన్నట్టు అర్థమవుతోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ మరోసారి రాజధానిగా అమరావతి సరికాదనేలా స్టేట్‌మెంట్ ఇచ్చారు. కృష్ణానదిలో అమరావతి నిర్మిస్తున్నారని, ఇది రాజధానికి అనువైన ప్రాంతం కాదన్నారు. రాజధాని నిర్మాణానికి లక్షకోట్లు కావాలన్నారు.
2014-19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ, అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ స్వాగతించింది. సాక్షాత్తూ అసెంబ్లీలో జగన్ అమరావతికి జైకొట్టారు. ఆ తర్వాత 2019లో జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని పట్టించుకోలేదు. పైగా మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తెచ్చారు. అయితే అమరావతి ప్రాంత రైతుల ఉద్యమాలు, కోర్టు చీవాట్ల నేపథ్యంలో మూడు రాజధానుల విధానంపై జగన్ ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది.
2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయానికి మూడు రాజధానుల విధానం కూడా కారణమని భావించారు. దీంతో వైసీపీ తన స్టాండ్ మార్చుకుంటుందని ఆశించారు. అన్నట్టుగానే ఆ పార్టీ నేత సజ్జల, తాము అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. రేపు జగన్ అధికారంలోకి వచ్చినా అమరావతి నుంచి పరిపాలిస్తారన్నారు. దీంతో వైసీపీ దారికొచ్చిందనుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరోసారి బాంబ్ పేల్చారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందన్నారు. అమరావతిపై మరోసారి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇదిప్పుడు సంచలనం కలిగిస్తోంది. వైసీపీ స్టాండ్ మారలేదని ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఇదే ఆ పార్టీ విధానమైతే, మున్ముందు ఆ పార్టీకి, ఆ పార్టీ నేతలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
12/12/2025
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత - అనారోగ్యంతో సొంతూరు మహారాష్ట్రలోని లాతూర్ లో తుదిశ్వాస విడిచిన శివరాజ్ పాటిల్ - ఆయన వయసు 91 ఏళ్లు- లాతూర్ నుంచి ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికైన పాటిల్ - కేంద్ర హోంమంత్రిగా, లోక్ సభ స్పీకర్ పని చేసిన శివరాజ్ పాటిల్ - ఇందిర, రాజీవ్ హయాంలో రక్షణ మంత్రిగా బాధ్యతలు - పంజాబ్ గవర్నర్ గా కూడా పనిచేసిన పాటిల్ - 2008లో ముంబై దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి పదవికి రాజీనామా.
12/12/2025
Breaking News
లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 15 మంది మృతి...
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం - అదుపు తప్పి లోయలో పడిన చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు- 15 మంది వరకు మృతి- చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తుండగా ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లిన బస్సు - భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకొని అన్నవరానికి వెళ్తుండగా ప్రమాదం
మెస్సీతో మ్యాచ్ కోసం సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి - వరుసగా రెండో రోజూ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన సీఎం.
01/12/2025
మళ్లీ పెళ్లి చేసుకున్న సమంత - దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహమాడిన సమంత - కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లో పెళ్లి - కొంతకాలంగా రాజ్ నిడిమోరుతో రిలేషన్‌ఫిప్ - రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించిన సమంత - 2021లో నాగ చైతన్యతో విడిపోయిన సమంత - 2022లో భార్య శ్యామాలి డే కు విడాకులు ఇచ్చిన రాజ్ నిడిమోరు.
27/11/2025
తెలంగాణ : తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ - డిసెంబర్ 11న తొలి విడతలో 4,236 గ్రామాల్లో ఎన్నికలు- నేటి నుంచి ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ- ఈనెల 30న నామినేషన్ల పరిశీలన- నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 వరకు గడువు.
22/11/2025
బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వర్ణ రథం పై ఊరేగిన తిరుచానూరు పద్మావతి అమ్మవారు.
దుబాయ్ ఎయిర్ షోలో ఘోర ప్రమాదం - కుప్పకూలిన భారత్ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్.
దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారు : కేటీఆర్
20/11/2025
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ షాక్ - ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ - కేటీఆర్ విచారణకు అనుమతి కోరుతూ కొంతకాలం కిందట గవర్నర్ కు లేఖ రాసిన ప్రభుత్వం.
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Contact the public figure
Telephone
Website
Address
Kukatpalli
500072