Government Jobs Alert

Government Jobs Alert

Share

Your ultimate source for staying informed about the Latest State and Central Jobs

20/12/2025
15/11/2025

15/11/2025

24/05/2025

ఒక యువకుడు ప్రతి సంవత్సరం జరిగే కంపెనీ మీటింగ్ కు వెళ్ళాడు .
అక్కడ పగలంతా మీటింగ్ లతో బిజీగా గడిపి హోటల్ రూంకి వచ్చేసరికి అలసిపోయాడు .

ఆకతో ఉన్న ఆ యువకుడు త్వరత్వరగా రెడీ అయి రెస్టారెంట్ లోకి అడుగుపెట్టాడు.

ఆకలిని పెంచే అద్బుతమైన వంటకాల వాసనలు, చక్కగా శుబ్రంగా ఉన్న రెస్టారెంట్ వాతావరణం ఇంకేం కావాలి....
హుషారుగా పరోటా ను , పన్నీర్ బటర్ మసాలాను ఆర్డర్ చేసి తినటానికి రెడీ అయిపోయాడు.

పరోటా నోట్లో పెట్టుకోబోతూండగా ....
ఎందుకో బయటికి చూసిన అతనికి,

ఆకలిగా లోపలికే చూస్తున్న రెండు కళ్ళు…
పదేళ్ళైనా నిండని కళ్ళలో ఆకలి కనిపించాయ్.

ఆకలితో ఆశగా హోటల్ అద్దాలలోంచి టేబుళ్ళ మీద పదార్థాలను చూస్తున్నాయి ఆ కళ్ళు.

అతని మనసు ద్రవించిపోయింది.

ఇప్పుడు ఎవరికళ్ళలో ఉన్నది నిజమైన భాద?
ఎవరిది నిజమైన ఆకలి.?
తినలేక పోయాడు.....

ఇప్పుడు అతని ఆకలి కడుపుది కాదు మనసుది.

ప్లేట్ అక్కడే వదిలేసి బయటకి వచ్చాడు.

ఆపసివానిని దగ్గరకు పిలిచాడు.

ఆపిల్లవాడికి కొంచెం పక్కలో ఉన్న మరో పసి పాప అతని చెల్లెలు..
ఇద్దరినీ తనతో పాటు లోపలికి పిలిచాడు.

మొదట భయపడ్డా .... ఆకలి ఇచ్చిన తెగింపో ,
అతని కళ్ళలో ఉన్న ఆప్యాయతో తెలియదు గానీ ఇద్దరూ లోపలికి వచ్చారు.

మురికి బట్టలు, చెప్పులు లేని కాళ్ళూ,
బెరుకు చూపులు....

తన టేబుల్ దగ్గరే వారినీ కూర్చో బెట్టి అడిగాడు
“ఏం తింటారు?” అని ,

ఇద్దరి పిల్లల వేళ్ళూ అతని ప్లేట్ వైపే చూపించారు.

నవ్వుతూ ఆ ఇద్దరికి కూడా తనతో పాటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు.

పరోటా ముట్టుకోబోతూ ఆగిపోయిన పిల్లవాడు
తన చెల్లెలిని తీసుకొని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ...
తన చేతులు కడుక్కొని , తన చెల్లెలి చేతులూ కడిగి మెల్లగా వచ్చి తినటం మొదలు పెట్టారు.

ఎంతో ఆశగా, ఆకలిగా, ఎంతో ఇష్టంతో నిజమైన ఆకలికి ఉండే భక్తితో ఆ పరోటాలనే చూస్తూ తిన్నారు ఇద్దరి పసివాళ్ళ పొట్టలూ..

వాళ్ళకి ఆకలి తీర్చిన ఆ యువకుడి మనసూ తృప్తిగా నిండిపోయాయ్.

ఆ పిల్లలు ఇద్దరినే చూస్తూ .... బిల్ల్ తెమ్మని చెప్పిన అతను చేతులు కడుక్కొని వచ్చేసరికి టేబుల్ మీద బిల్ స్లిప్…

చేతిలోకి తీసుకుని అలా చూస్తూనే ఉండిపోయాడు....

అతని కంట్లోంచి జారిన కన్నీటి చుక్క స్లిప్ మీద పడేసరికి తేరుకొని…

కౌంటర్ దగ్గర కూచున్న మనిషి వైపు చూసాడు…

అక్కడ కూచున్న వ్యక్తి చిరునవ్వుతో ఇతన్నే చూస్తున్నాడు...

మనుషుల్లో నీలాంటి వాళ్ళు మరికొందరం ఉన్నాం అని చెప్పినట్టుగా ఉందా నవ్వు....

మళ్ళీ ఒక సారి బిల్ వైపు చూసాడతను
అక్కడ ఏం రాసి ఉందో తెలుసా..!?

“మానవత్వానికి బిల్ వేసే యంత్రాలు ఇక్కడలేవు” అని.

30/08/2024

Eye 👀 Test :-
మీ కళ్లకి పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న నెంబర్ ఏంటో చెప్పండి చూద్దాం....😇🤔😇

26/08/2024

అలలు పోయి.. శిలలు.. విశాఖలో 400 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం

ఇసుక తిన్నెలపై ఎగిరి.. చల్లగాలులు ఆస్వాదిస్తూ.. సాగర జలాల్లో ఆడాలని విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌కు చాలా మంది వెళ్తుంటారు. తీరా వెళ్లాక.. ఎగసిపడుతున్న అలలు చూసి వెనకడుగు వేస్తారు. శనివారం అలాంటి ఇబ్బందేం లేకుండా ఆ సముద్రుడే సుమారు 400 మీటర్లు వెనక్కి వెళ్లాడు. దీంతో పర్యాటకులు తీరంలో బయటపడ్డ రాళ్లపైకి చేరి ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. అయితే సాగర కదలికలు గమనించి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Want your business to be the top-listed Recruitment Company in Kothapet?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Kothapet