Spark
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Spark, Restaurant, Kakinada.
18/07/2018
మష్రూమ్స్ మంచూరియా
కావలసిన పదార్థాలు
మష్రూమ్స్ - 200 గ్రా., మిరియాల పొడి - ఒక టీ స్పూను, బియ్యప్పిండి, మైదా, కార్న్‌ఫ్లోర్ - 3 టేబుల్ స్పూన్ల చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, కారం - ఒక టీ స్పూను, నీరు - అరకప్పు, నూనె - వేగించడానికి సరిపడా, ఉల్లిపాయలు - 2, వెల్లుల్లి రెబ్బలు - 4, సోయా సాస్ - 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, టమోటా సాస్ - ఒక టేబుల్ స్పూను, టమోటా ప్యూరీ - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అలంకరణకు.
తయారుచేసే విధానం
ఒక బౌల్‌లో బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, మైదా, కారం, ఉప్పు (ఇష్టమైతే చిటికెడు ఆరంజ్ ఫుడ్ కలర్) వేసి నీటితో జారుగా కలుపుకోవాలి. రెండు ముక్కలుగా తరిగిన మష్రూమ్స్‌ను జారులో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. ఇప్పుడు మరో కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లి తరుగు, పొడుగ్గా చీరిన పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు చిటికెడు ఉప్పు వేసి వేగించాలి. తర్వాత సోయా సాస్, టమోటా ప్యూరీ, సాస్ (ఇష్టమైతే అజినమోటో చిటికెడు) వేయాలి. రెండు నిమిషాల తర్వాత పక్కనుంచిన మష్రూమ్స్ వేసి చిక్కబడేవరకూ ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి. ఇవి స్నాక్స్‌గా లేదా భోజనంతో పాటు సైడ్ డిష్‌గా బావుంటాయి.
05/07/2018
Rosemary Ranch Chicken Kabobs
Rosemary Ranch Chicken Kabobs Recipe This rosemary ranch chicken recipe is so delicious, tender, and juicy the chicken will melt in your mouth.
05/07/2018
వెజిటబుల్ పిజ్జా
కావలసినవి
గోధుమపిండితో చేసిన పిజ్జా బేస్-ఒకటి, పెద్ద టొమాటోలు -మూడు (సన్నటి ముక్కలుగా తరిగి), మరో పెద్ద టొమాటో-ఒకటి (గుండ్రంగా రింగులుగా కోసి), ఉల్లిపాయ (పెద్దది)- ఒకటి (ముక్కలుగా తరిగి), కాప్సికం ముక్కలు-ఒక కప్పు (పసుపు, ఆకుపచ్చ, ఎరుపు కాప్పికమ్‌లు వాడాలి), పుట్టగొడుగులు-పది (సన్నగా తరిగి), చీజ్- అర కప్పు (తురుము), ఉప్పు, మిరియాలపొడి- రుచికి సరిపడా, చక్కెర- ఒక టేబుల్‌స్పూను, ఆలివ్ ఆయుల్-ఒక టేబుల్‌స్పూను.
తయారీవిధానం
పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేడిచేయాలి. ఉల్లిపాయముక్కలను అందులో వేసి కాసేపు వేగించాలి. టొమాటో ముక్కలను వేసి మెత్తగా అయ్యేదాకా వేగించాలి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేయాలి. చక్కెర కూడా కలపాలి. తర్వాత అరకప్పు నీళ్లు పోసి దగ్గరపడేదాకా స్టవ్‌పై ఉడికించాలి. పిజ్జా బేస్ తీసుకుని ఈ సాస్‌ని దానిపై పరవాలి.
తరిగిపెట్టుకున్న కాప్సికం, పుట్టగొడుగుల ముక్కలు సాస్‌పై చల్లాలి. చివరిగా చీజ్ తరుగును కూడా పిజ్జాపై చల్లాలి. పిల్లలకు ఇష్టమైతే కొత్తిమీర లేదా పుదీనాను కూడా పిజ్జాపై చల్లొచ్చు. దీన్ని హాట్ ఒవెన్‌లో ఐదు నిమిషాలు బేక్ చేసి వేడి వేడిగా ఆరగించొచ్చు.
12/06/2017
రైస్ పకోడి
కావలసిన పదార్థాలు
అన్నం - 2 కప్పులు, శనగపిండి - అరకప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, ఉల్లి తరుగు - అరకప్పు, ధనియాల పొడి - 2 టీ స్పూన్లు, జీరా పొడి - 1 టీ స్పూను, కారం, సోంపు, వాము - అర టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - అరకప్పు, ఇంగువ - చిటికెడు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం
నూనె తప్పించి తక్కిన పదార్థాలన్నీ ఒక లోతైన వెడల్పాటి బౌల్‌లో వేసి తగినంత నీరు కలుపుతూ ముద్ద చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో దోరగా వేగించాలి. వేడివేడిగా టమోటా కెచప్‌తో తింటే బాగుంటాయి.
06/06/2017
***కొత్తిమీర, లెమన్ సూప్***
కావల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 1, ఉల్లికాడలు - 1, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లిపాయ - 1, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, వెజిటబుల్ స్టాక్ - 4 కప్పులు, మిరియాల పొడి - కొంచెం, ఉప్పు - రుచికి సరిపడా, వెన్న - 1 టీ స్పూను
తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయ, ఉల్లికాడ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఫ్రైయింగ్ పానలో వెన్న వేసి కరిగిన తరువాత అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు అన్నింటినీ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి.
ముక్కలన్నీ మెత్తగా అయ్యేవరకు వేయించి, అందులో వెజిటబుల్ స్టాక్ (కూరగాయ ముక్కలు ఉడికించుకున్న నీళ్లు) పోసి బాగా ఉడికించాలి. తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. సూప్ చిక్కగా మారే సమయంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి.
బట్టర్‌తో గార్నిష్ చేసుకుని, వేడివేడిగా సర్వ్ చేయాలి.
06/06/2017
పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే చీజ్ ఆమ్లెట్ ఎలా చేయాలో తెలుసా?
కోడిగుడ్డు, చీజ్ పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. చీజ్ పిల్లలకు ఇవ్వడం ద్వారా ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే చీజ్‌ను మితంగానే వాడాలి. అలాగే కోడిగుడ్డును రోజుకొకటి తీసుకుంటే.. ఓ రోజు సరిపడా శక్తిని అందిస్తుంది. అందుకే ఈ రెండింటి కాంబోలో వంటకాలు పిల్లలకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. సో వేసవి సెలవుల్లో ఇంట్లో వున్న మీ పిల్లలకు స్నాక్స్‌గా చీజ్ ఆమ్లెట్ ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు :
చీజ్ - అర కప్పు
కోడిగుడ్డు - ఐదు
గరంమసాలా - పావుటీస్పూను,
క్యాప్సికమ్ ముక్కలు - పావుకప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
నూనె, ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు,
తయారీ విధానం:
ముందుగా ఓ బౌల్‌లో కోడిగుడ్లను పగుల కొట్టి బాగా గిలకొట్టుకోవాలి. అందులోనే కాసింత ఉప్పు, పసుపు చేర్చి మరోసారి గిలకొట్టాలి. తర్వాత పాన్‌లో నూనె పోసి ఉల్లిముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆపై గరంమసాలా, పసుపు, కారం, కొత్తిమీర తురుము, అన్నీ వేసి కలిపి వేయించి తీసి గిలకొట్టిన గుడ్డుసొనలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోయాలి. రెండువైపులా కాలాక ఒకవైపున చీజ్ తురుము చల్లి అది కరిగేవరకూ సిమ్‌లో ఉంచి దించాలి. అంతే చీజ్ ఆమ్లెట్ రెడీ.
06/06/2017
Aloo Bhujia
aloo bhujia recipe | aloo bhujia sev recipe | potato sev recipe recipe: http://hebbarskitchen.com/aloo-bhujia-recipe-potato-sev-recipe/ Website – http://hebbarskitchen.com/ Facebook – https://www.facebook.com/HebbarsKitch...
06/06/2017
పచ్చిమామిడి రైస్
www.teluguone.com Mango Rice,summer special recipes,how to make Mango Rice,mango rice recipe indian,How to Make Raw Mango Rice
06/06/2017
dry fruits laddu recipe | dry fruits ladoo recipe - no sugar, no jaggery recipe: http://hebbarskitchen.com/dry-fruits-laddu-recipe-dry-fruits-ladoo-recipe-no-sugar-no-jaggery/ Website – http://hebbarskitchen.com/ Facebook – https:...
31/05/2017
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Kakinada
533005