Computer House SALES &services
We are your one stop technology for all your computer needs. We offer new computers with full warra
లాప్ టాప్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ ఇవ్వాలంటే…
రూ.26 వేల రూపాయల నుండే ప్రాధమిక స్థాయి లాప్ టాప్ లు లభిస్తుండడంతో ఇటీవలి కాలంలో చాలామంది లాప్ టాప్ ల కొనుగోలుకి మొగ్గు చూపుతున్నారు. లాప్ టాప్ విషయంలో ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్! ఖరీదైన మోడళ్ళు అయితె నాలుగు గంటలకు మించి బ్యాటరీ బ్యాకప్ లభించదు. ఈ నేపధ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ బ్యాటరీ ఇప్పటికన్నా ఎక్కువ సమయం వచ్చేలా చేయవచ్చు. కేవలం ప్రస్తుతం పనిచేస్తున్న అప్లికేషన్లని మాత్రమే ఓపెన్ చేసి మిగిలిన వాటిని క్లోజ్ చేయండి. బ్యాటరీపై నడిచేటప్పుడు స్క్రీన్‍ని డిమ్ చేయండి. లాప్ టాప్ అడుగుభాగంలో వేడి బయటికి ప్రసరించడానికి holes ఉంటాయి. వేడి బయటకు వెళ్ళకుండా ఆ holes కి ఏదైనా అడ్డుగా ఉంటే లోపలి ఉష్ణోగ్రతలు పెరిగి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. అలాగే బ్యాటరీపై నడిచేటప్పుడు డివిడి మూవీలను చూడడం గానీ, ఎక్కువ సిస్టమ్ వనరులను ఉపయోగించుకునే త్రీడి గేమ్‍లను ఆడడం గానీ చేయకండి. USB పోర్టులకు కనెక్ట్ చేసుకునే డివైజ్‍ల సంఖ్య పెరిగే కొద్ది వాటికి విద్యుత్ సరఫరా చేయబడుతుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. వీలైనన్ని తక్కువ USB డివైజ్‍లను కనెక్ట్ చేయండి. లాప్‍టాప్‍ని Standby, Hibernate చేయకండి. నేరుగా సూర్యకాంతిలో వాడకండి. Wireless LAN (WLAN) , Bluetooth వంటి అదనపు సదుపాయాలని అవసరం లేనప్పుడు డిసేబుల్ చేయండి. బ్యాటరీ ఆదా అవుతుంది.
డివైజ్ డ్రైవర్స్
ఇంటర్నెట్ ద్వారా డ్రైవర్స్ ని సులువుగా పొందాలంటే గూగుల్ లో సెర్చింగ్ చేయడం కంటే నేరుగా సంభందిత కంపెనీ వెబ్ సైట్లో కి వెళ్లి, డ్రైవర్స్ కోసం వెతకాలి.
ల్యాప్ టాప్ డ్రైవర్స్ ని నేరుగా మోడల్ ని బట్టి కంపెనీ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హార్డ్ వేర్ తయారీ సంస్థలన్నీ కూడా ప్రతి డివైస్ ని తమ కంపెనీ వెబ్ సైట్ లో వుంచుతుంటాయి. అయితే వీటిని పొందటం కష్టమేమి కాదు. అయితే ప్రత్యే కంగా డ్రైవర్స్ కోసం కొన్ని ఇతర వెబ్ సైట్స్ కూడా వాడుకలో వున్నాయి
కొన్ని డ్రైవర్స్ వెబ్ సైట్స్ ను క్రింద పొందుపరచడం జరిగింది ఈ వెబ్ సైట్స్ లోకి వెళ్లి కూడా మనం ఉచితంగా డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
http://www.driverguide.com/
http://www.driverzone.com/
http://www.driverfiles.net/
http://www.driverworld.dk/
driver.softpedia.com
http://www.driver-soft.com/
http://www.nodevice.com/
05/10/2015
యాంటీస్టాటిక్ రిస్ట్ బేండ్:
మన కంప్యూటరులో ఉండే విడిభాగాలు అన్ని చిన్న చిన్న సున్నితమైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లను కలిగి ఉంటాయి. అవి చాలా తక్కువ ఓల్టేజితో పనిచేస్తాయి. మన కదలికల ద్వారా ఉత్పత్తి అయిన స్టాటిక్ ఎలెక్ట్రసిటి ఓల్టేజి వలన కూడా అవి పాడయిపోయే ప్రమాదం ఉంది కనుక స్టాటిక్ ఎలెక్ట్రసిటి ని డిస్చార్జి చేయడానికి యాంటీస్టాటిక్ రిస్ట్ బేండ్ ధరించాలి.
29/09/2015
సిపియు డబ్బాలో ఉండే భాగాలు
కంప్యూటరు లో అతి ముఖ్యమైన భాగం సిపియుగా మనం పిలుచుకొనే రేకు డబ్బా. దీనిని కాబినెట్ అంటారు. ఇది రేకు డబ్బా అయినప్పటికీ దీనిలో మన కంప్యూటరు పనిచేయడానికి కావలసిన అన్ని పరికరాలు అమర్చబడి ఉంటాయి కనుక అది అతిముఖ్యమైనది, ఖరీధైనది. అందువలన దీని గురించి తెలుసుకోవడం తప్పనిసరి. మనం సిపియుని అప్పుడప్పుడు శుభ్రం చేయడానికి సిపియు డబ్బాకి ఒక వైపు ఉన్న రేకుని తొలగించినపుడు క్రింది చిత్రంలో వలే కనిపిస్తుంది. మొదటిసారి చూసేవారికి కొంత కొత్తగా అనిపించినప్పటికి ఒకటి రెండు సార్లు చూస్తే మనమే మన సిపియు డబ్బాని విప్పి శుభ్రం చేసుకోవచ్చు.
మధర్ బోర్డ్:
మన సిపియు లో ఉన్న పెద్దబాగం మధర్ బోర్డ్ లేదా మెయిన్ బోర్డ్. కంప్యూటరులో ఉన్న అన్ని పరికరాలు (కొన్ని నేరుగా కొన్ని కేబుళ్ళ ద్వారా)దీనికి కలుపబడి ఉంటాయి.
యస్‌యమ్‌పియస్:
ఇది కంప్యూటరులోని అన్ని బాగాలకు కరెంటును సరఫరా చేస్తుంది. దీనిని నుండి వచ్చిన వివిధ రకాల కేబుళ్ళు వివిధ కంప్యూటరు భాగాలకు కలుపబడి ఉంటాయి.
హార్డ్‌డిస్క్:
మన సమాచారం ఫైళ్ళ రూపంలో దీనిలో బధ్రపరచబడి ఉంటుంది. దీనికి యస్‌యమ్‌పియస్ నుండి ఒక పవర్ కేబుల్ దీనినుండి మధర్ బోర్డుకు ఒక డాటా కేబుల్ కలుపబడి ఉంటాయి. మన కంప్యూటరులో మధర్ బోర్డులో ఉన్న పోర్టులను బట్టి మరిన్ని హార్డ్‌డిస్క్‌లు పెట్టుకోవడానికి కాబినెట్‌లో స్థలం ఉంటుంది.
సిపియు ఫ్యాన్:
మధర్‌బోర్డులో ప్రాససర్ పైన ఇది అమర్చబడి ఉంటుంది. ప్రాససర్ వేడెక్కకుండా చూడడం దీని పని. ఎక్కువగా దుమ్ము దీనికే పడుతుంది.
డివిడీడ్రైవ్:
డివిడీ/సీడీ లు చదవడానికి, వ్రాయడానికి ఉపయోగపడుతుంది. దీనికి యస్‌యమ్‌పియస్ నుండి ఒక పవర్ కేబుల్ దీనినుండి మధర్ బోర్డుకు ఒక డాటా కేబుల్ కలుపబడి ఉంటాయి. మన కంప్యూటరులో మధర్ బోర్డులో ఉన్న పోర్టులను బట్టి మరిన్ని డివీడీ డ్రైవ్‌లు పెట్టుకోవడానికి కాబినెట్‌లో స్థలం ఉంటుంది.
రామ్:
మధర్ బోర్డులో సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రామ్ పెట్టుకోవడానికి కావలసిన స్లాటులు ఉంటాయి. ఎక్కువగా కంప్యూటర్ల సమస్యలు ఈ రామ్ వలన వస్తుంటాయి. చాలాసార్లు రామ్ తీసి వేరొక స్లాట్ లో పెట్టడం వలన కాని ఒకటి కంటే ఎక్కువ రామ్‌లు ఉన్నపుడు ఒకటి తీసివేయడం వలన సమస్య పరిష్కారం అవుతుంది.
29/09/2015
మీ కంప్యూటరులో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టంలు వాడుతున్నారా?
విండోస్ యొక్క రిఈన్‌స్టాల్ డిస్క్ మరియు ఆపరేటింగ్ సిస్టం అలాగే మన ఫైళ్ళు బ్యాకప్ తీసుకున్న తరువాత మాత్రమే ప్రయత్నించవలసి ఉంటుంది.
విండోస్ లో ఉండగా ఉబుంటు, ఉబుంటులో ఉండగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ లను మనం తొలగించడం లేదా మార్చడంచేయకుడదు. దానివలన రెండు ఆపరేటింగ్ సిస్టంలు పనిచేయకుండా పోతాయి.
విండోస్‌లో కనిపించని రికవరీ మరియు తయారీదారుకి సంభందించిన పార్టీషియన్‌లు ఉబుంటులో కనిపించినప్పటికి మనం వాటిలోని పైళ్ళను మార్చడం కాని డ్రైవ్ ని తొలగించడం కాని చేయరాదు.
ఉచిత ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ముందే విండోస్ అప్‌డేట్లు అన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.
ఒకొకసారి విండోస్ అప్‌డేట్ అయిన తరువాత ఉబుంటు అసలు కనిపించకుండా పోతుంది. అటువంటప్పుడు మనం ఉబుంటు లైవ్ డిస్క్ ని ఉపయోగించి మనం మునుపటిలా ఉబుంటు మరియు విండోస్ 8 డ్యూయల్ బూట్ అయ్యేవిధంగా చేసుకోవచ్చు.
పొరపాటు జరిగి రెండుఆపరేటింగ్ సిస్టంలు బూట్ కానప్పటికి కంగారుపడి తిరిగి ఇన్‌స్టాల్ చెయ్యకండి. రెండిటిని కూడా యధాస్థితిలో రికవరీ చేయ్యడానికి మనకి నెట్‌లో పలు ఉపాయాలు దొరుకుతాయి.
28/09/2015
సపోర్ట్ నిలిపి వేయబడిన పాత కంప్యూటర్లకు జీవం పొయ్యండిలా
మనం ఇప్పుడు వాడుతున్న పాత కంప్యూటర్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిపివేయడం వలన ఇక పై ఆ ఆపరేటింగ్ సిస్టంకు సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు కనుక ప్రత్యామ్నాయాల కోసం చూడవలసిన అవసరం ఏర్పడింది. మనం డబ్బులు పెట్టి కొత్త ఆపరేటింగ్ సిస్టం కొన్నప్పటికి అది మన పాత కంప్యూటర్ యొక్క సామర్ధ్యం తక్కువగా ఉండడం వలన దానిలో పని చేయకపోవచ్చు. అందువలన మనం తప్పనిసరిగా మన కంప్యూటరు యొక్క సామర్ధ్యాన్ని విడిబాగాలను మార్చుకోవడం లేదా రామ్ వంటి విడిబాగాలను అధనంగా చేర్చడం ద్వారా పెంచుకోవలసి రావచ్చు. వీలుకాని పరిస్థితులలో పూర్తిగా కంప్యూటరుని మార్చవలసి రావడం కూడా జరుగుతుంది. దీనికి కారణం ఆపరేటింగ్ సిస్టం తయారీదారు మరియు కంప్యూటర్ల తయారీదారులు కలిసి టెక్నాలజీ మెరుగుదల పేరుతో కొంతకాలానికి కంప్యూటర్లు మార్చడాన్ని తప్పనిసరి అవసరంగా తయారుచేయడం. దానివలన మనకి ఏవో కొన్ని ప్రయోజనాలున్నప్పటికిని ఆర్ధికంగా (కంప్యూటర్లను మరియు ఆపరేటింగ్ సిస్టం మార్చడానికి పెట్టుబడి) మరియు పర్యావరణపరంగా చాలా (కంప్యూటర్ వ్యర్ధాలు పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించ బోవడం) నష్టదాయకం.
మన పాత కంప్యూటరును మార్చకుండానే సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించబడే ఆపరేటింగ్ సిస్టం మనకు అందుబాటులో ఉంటే దానికి పరిష్కారం దొరికినట్లే. అదీ ఉచితంగా దొరికితే ఇంకా బాగుంటుంది కదా. అవే ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు. ఇవి లాభాపేక్షలేని కొన్ని సంస్థలచే మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లచే స్వచ్చందంగా అభివృద్ది చేయబడుతున్నాయి. పాత కంప్యూటర్లలో పనిచేయడానికి మనకు చాలా ఆపరేటింగ్ సిస్టంలు ఇప్పుడు మనకు ఇంటర్‌నెట్ లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నిరంతరం కొత్త పీచర్లతో అప్‌డేట్ అవుతూ, మనం చూడడానికి ఇప్పుడు వాడే ఆపరేటింగ్ సిస్టం లానే ఉండే లుబుంటు.
ఇది తక్కువ సామర్ధ్యం గల పాత డెస్క్‌టాప్, లాప్‌టాప్ మరియు మాక్ కంప్యూటర్లలో పనిచేయడానికి అనుగుణంగా వేగంగా, తేలికగా ఉండేటట్లు తయారుచేయబడింది. పెన్‌టియం 2, సెల్‌రాన్ వంటి పాత ప్రాససర్లతో ఉన్నటు వంటి కంప్యూటర్లలో కూడా పనిచేస్తుంది. తక్కువ వనరులని వాడుకొని వేగంగా పనిచేయడం దీని ప్రత్యేకత. అదే విధంగా కొత్త కంప్యూటర్ల కోసం 64బిట్ వెర్షను కూడా అందుబాటులో ఉంది. లుబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇక్కడ నుండి దింపుకోవచ్చు. దీనిని పెద్దగా పరిజ్ఞానం లేనివారు కూడా సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బాగా పాత సిస్టంలలో సీడీ ద్వారా లాప్‌టాప్‌లు కొత్త కంప్యూటర్లలో పెన్‌డ్రైవ్ ద్వారాను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
Computer House SALES &services We are your one stop technology for all your computer needs. We offer new computers with full warra
18/09/2015
ఆరోగ్యవంతమైన కంప్యూటర్‌కి ఐదు సూత్రాలు
మన కంప్యూటరు మన జేబుకి చిల్లు పెట్టకుండా ఉండాలంటే మనం కంప్యూటర్‌పై గడిపే సమయంలో కొంత సమయం అప్పుడప్పుడు కేటాయిస్తే మన కంప్యూటర్ ఆరోగ్యకరంగా సమస్యలు లేకుండా ఉంటుంది. దాని ఫలితంగా మనం సమయాన్ని మరియు డబ్బుని ఆధా చేసుకోవచ్చు. కంప్యూటర్ కి ప్రధాన శత్రువులు అయిన వాటిపై మనం జాగ్రత్తగా ఉంటే మన కంప్యూటర్ జీవితకాలాన్ని పెంచుకోవడమే కాకుండా తరచు చదివింపులనుండి తప్పించుకోవచ్చు. చాలా రోగాల విషయంలో చెప్పినట్టు చికిత్స కన్నా నివారణ మేలు అని కంప్యూటరు విషయంలో కూడా దీనిని వర్తించుకోవచ్చు. సమస్య వచ్చాకా దాన్ని బాగు చేసుకొనేకన్నా రాకముందే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకొంటే మన కంప్యూటరుని మంచి కండీషన్‌లో ఉంచుకోవచ్చు. క్రింద చెప్పిన ఐదు విషయాలు మనం పాటిస్తే కంప్యూటరు సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
శుభ్రంగా ఉంచుకోవడం:
కంప్యూటరుకు దుమ్ము ప్రధాన శత్రువుల్లో ఒకటి దుమ్ము. ఇది మన కంప్యూటరులో చేరి పనితీరును దెబ్బతీయడమే కాకుండా కంప్యూటరు చల్లబరచడానికి గల ఫ్యాన్‌లపై చేరి మిగిలిన అన్ని బాగాలను వేడెక్కేటట్లు చేస్తుంది. మన కంప్యూటర్ ని అప్పుడప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి లేదా కనీసం కంప్యూటరు నుండి శబ్ధం వచ్చినపుడు అయినా తప్పక శుభ్రంచేయాలి.
వేడెక్కకుండా ఉంచుకోవాలి:
కంప్యూటర్ సిపియు అన్నిటికన్నా ప్రధానమైనది అయినప్పటికి దానిని ఎక్కడో ఏదో ఒక మూలలో ఉంచడం మనం సాధారణంగా చూస్తుంటాము. సిపియుని సరిగా గాలి తగిలే, ఎండ తగలని, తడిలేని స్థలంలో ఉంచుకోవాలి. సిపియు ఫ్యాన్‌లు అన్న వైపు అడ్డంకులు ఉంచగూడదు. కొన్ని రోజులకి ప్రాససర్ ఫ్యాన్ క్రింద ఉన్న పేస్ట్ ఆరిపోతుంది కనుక అప్పుడప్పుడు దాన్ని చూసి లేకపోతే కొత్త పేస్టు పెట్టుకోవాలి. అలాగే కంప్యూటరు శుభ్ర పరిచినప్పుడు ఎక్కువగా దుమ్ము ఉండే ప్రదేశంగా మనం సిపియు ఫ్యాన్ ని గుర్తించవచ్చు. అందువలన సిపియు ఫ్యాన్ని కూడా తప్పకుండా శుభ్రపరుచుకోవాలి.
కరెంటు :
కంప్యూటరుకు మరో ప్రధాన శత్రువు తరచు కరెంటు పోవడం. ఇది మన చేతుల్లో లేనప్పటికి యూపియస్ వాడడం ద్వారా మనం దీనిని అరికట్టవచ్చు. మనం కంప్యూటర్లో ఏదైనా ఏదైనా పనిచేస్తున్నప్పుడు కరెంటు పోవడం వలన ర్యామ్, హార్డ్ డిస్క్ వంటివి చెడిపోతుంటాయి. సాధారణంగా కంప్యూటర్లో ఏదైనా విడిభాగం చెడిపోతే అది కచ్చితంగా కరెంటు పోయినప్పుడూ కాని, కరెంటు వస్తూపోతూఉన్నపుడు ఓల్టేజి హెచ్చుతగ్గుల వలన కాని జరుగుతుంటుంది. అందువలన కరెంటు వస్తూపోతూ ఉన్నపుడు కంప్యూటరును ఆన్ చెయ్యకపోవడమే మంచిది. ఎర్తింగ్ కూడా తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలి. యూపియస్ తప్పకుండా వాడడం వలన కరెంటు ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చు. కంప్యూటరు అకస్మాత్తుగా మనం ఆపకుండా ఆగిపోవడాన్ని నివారిస్తే హార్డ్‌డిస్క్ బ్యాడ్ సెక్టార్లు రావడం, ఆపరేటింగ్ సిస్టం కరెప్టెడ్, ఫైల్ మిస్సింగ్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
వైరస్:
తరచు కంప్యూటర్లు బాగుచేయించడానికి వచ్చే వాటిలో ఎక్కువ గా వైరస్ సమస్యలతో వస్తుంటాయి. మొత్తంగా వాటిని వైరస్‌లు అని మనం పిలుచుకున్నప్పటికి వాటిలో మాల్‌వేర్లు, ట్రోజాన్, స్పైవేర్లు అని చాలారకాలు సిస్టంకి హాని కలిగించే సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. ఈ వైరస్‌ల వలన ఆపరేటింగ్ సిస్టం చెడిపోవడంకాని సిస్టం నెమ్మదిగా పనిచేయడం గాని జరుగుతుంది. వైరస్ అన్నది మన కంప్యూటరికి నెట్ నుండి గాని పెన్‌డ్రైన్ వలన గాని వస్తుంది. కనుక ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని తరచు దానితో మన సిస్టంని స్కాన్ చేసుకోవాలి. అన్నట్టు యాంటీ వైరస్ ని ఎల్లపుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి ఎందుకంటే యాంటీవైరస్‌కి వైరస్‌లను గుర్తుపట్టి వాటిని నిర్వీర్యం చేసే శక్తి అప్‌డేట్ల ద్వారానే అందుతుంది. సిస్టంకి పెన్‌డ్రైవ్ తగిలించినపుడు ముందుగా దాన్ని యాంటీవైరస్‌తో స్కాన్ చేసిన తరువాతనే తెరవాలి. అంతేకాకుండా అడ్డమైన సైట్స్‌ని తెరవకుండా ఉండడం కూడా నెట్ నుండి వైరస్‌లు రాకుండా ఉండడానికి చక్కని పరిష్కారం.
అప్‌డేట్:
ఆపరేటింగ్ సిస్టం లో ఉన్న బధ్రతా పరమైన లోపాలను సవరించడానికి తయారీదారు సమస్యని గుర్తించినపుడు ఆసమస్యకి సంబంధించిన పరిష్కారాన్ని అప్‌డేట్స్ రూపంలో విడుదల చేస్తుంటారు. కనుక మనం వాడే ఆపరేటింగ్ సిస్టం,డ్రైవర్ల మరియు సాఫ్ట్‌వేర్ల అప్‌డేట్స్ ని తప్పకుండా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మనం చేయవలసిందల్లా అప్‌డేట్స్ అందుబాటులో ఉన్నాయి ఇన్‌స్టాల్ చెయ్యాలా అని అడిగినప్పుడు ఒకే అని నొక్కడమే.
18/09/2015
క్రెడిట్ కార్డు అంత చిన్న కంప్యూటర్
కంప్యూటర్ వచ్చిన తొలిరోజులలో పెద్ద గది అంత ఉండేది. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా క్రమంగా రూపు మార్చుకొంటూ చిన్నదవుతూ వచ్చింది. డెస్క్‌టాప్, లాప్‌టాప్ చివరకి అరచేతిలో పట్టే మొబైల్ ఫోన్ ఇలా చిన్నది తయారయింది. ఇప్పుడు మరింత చిన్నదిగా అంటే మనం వాడే క్రెడిట్/ఏటియం కార్డు పరిమాణంలో మారిపోయింది. అలా క్రెడిట్ కార్డు అంత ఉన్న కంప్యూటర్ పేరే రాస్ప్‌బెర్రి పై.
యస్‌డి కార్డు ప్రక్కన రాస్ప్‌బెర్రి పై
రాస్ప్‌బెర్రి పై ని కంప్యూటర్ సైన్స్ మూలాల గురించి తక్కువ ఖరీదులో పాఠశాలలలో బోధించడాన్ని ప్రోత్సహించడానికి ఇంగ్లాండు లో ఉన్న రాస్ప్‌బెర్రి పై ఫౌండేషన్ వారు తయారుచేసారు. దీనిని వాణిజ్య పరంగా తయారుచేసి అమ్మడానికి న్యూఆర్క్ ఎలిమెంట్ 14, ఆర్‌యస్ కాంపోనెంట్స్ మరియు ఇగొమెన్ అన్న సంస్థలకి అనుమతి గలదు. రాస్ప్‌బెర్రి పై లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి 25 డాలర్లు, ఇంకొకటి 35 డాలర్లు. ఆ సంస్థలు రాస్ప్‌బెర్రి పై ని తయారుచేసి ఆన్‌లైన్‌లో అమ్మకాలు కొనసాగిస్తారు.
రాస్ప్‌బెర్రి పై లో క్రెడిట్ కార్డు పరిమాణం ఉన్న బోర్డులో కంప్యూటరుగా పనిచేయడానికి కావలసిన అన్ని పరికరాలు అమర్చినారు. దీనిలో 700 మెగా హెర్ట్‌జ్ ప్రాససర్, 250 మెగా హెర్ట్‌జ్ జిపియు, 256 లేదా 512 యంబి రామ్, ఒకటి లేదా రెండు యుయస్‌బి పోర్టులు, ఇథర్‌నెట్ పోర్టు, హెచ్‌డియమ్‌ఐ పోర్టు, 3.5 యమ్‌యమ్ జాక్, పవర్ కోసం ఒక మైక్రో యుయస్‌బి పోర్టు మరియు యస్‌డి కార్డు స్లాటు ఉన్న ఈ కంప్యూటరు 45 గ్రాములు ఉంటుంది.
రాస్ప్‌బెర్రి పై మోడల్ బి నమూనా చిత్రం
రాస్ప్‌బెర్రి పై లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి రాస్ప్‌బియన్ అను డెబియన్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. రాస్ప్‌బియన్ కాకుండా ఈ చిన్ని కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వివిధ ఆపరేటింగ్ సిస్టంలు అందుబాటులో ఉన్నాయి. వాటికి ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిలో మనం ఆపరేటింగ్ సిస్టమును యస్‌డి కార్డులో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Vanasthali Puram Road
Hyderabad
500070
Opening Hours
| Monday | 9am - 9pm |
| Tuesday | 9am - 9pm |
| Wednesday | 9am - 9pm |
| Thursday | 9am - 9pm |
| Friday | 9am - 9pm |
| Saturday | 9am - 9pm |
| Sunday | 9am - 9pm |