Jakka Venkat Reddy
Peerzadiguda Municipal Corporation
21/06/2026
- మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ డివిజన్ కమలానగర్‌లో వంశరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ఉప్పలమ్మ వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం మరియు పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొల్తూరి మహేష్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు బోడిగే రాందాస్ గౌడ్, రఘువీర్ సింగ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.ఈ సందర్భంగా నిర్వాహకులు శ్యామల సాయిలు, శ్యామల శ్రీనివాస్ అతిథులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వంశరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండారి ఉప్పలయ్య, బి. రమేష్, బి. యాదగిరి, రామస్వామి, నరసింహ, కే. రమేష్, శ్రీశైలం, ఆంజనేయులు, చిందం పాండు, కొల్తూరి ఆమర్, వెంకట్ నాయక్, మురారీ తదితరులు పాల్గొన్నారు.
BRS Party
“Luxury Starts in the Kitchen, Love Grows at the Dining Table.”
✨ Building more than homes — creating experiences.
18/06/2026
17/06/2026
ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం మేడిపల్లిలోని తులిప్స్ గ్రాండ్ హోటల్‌లో ఘనంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ అధ్యక్షతన, జనరల్ సెక్రటరీ సామ సతీష్ రెడ్డి సమన్వయంతో నిర్వహించిన ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో బిల్డర్స్ సభ్యులు పాల్గొన్నారు.
సమావేశానికి తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సి. ప్రభాకర్ రావు, ముఖ్య సలహాదారు మరియు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జేపీ విద్యాసాగర్ ముఖ్య అతిథులుగా హాజరై నిర్మాణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై విలువైన సూచనలు చేశారు.
ప్రస్తుతం నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా సెంట్రింగ్, మేస్త్రి కార్మికుల సమ్మె ప్రభావం, TGSPDCL శాఖ నుంచి బిల్డర్లకు ఎదురవుతున్న వివిధ ఇబ్బందులు, అలాగే ఇటీవల ప్రభుత్వం పట్టా భూములు మరియు రిజిస్టర్డ్ ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చిన అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.
ఈ సందర్భంగా బిల్డర్స్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు.అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గావ్యవహరించిన ShreeTMT వారికి కృతజ్ఞతలు తెలిపారు.
BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR KCR
16/06/2026
పీర్జాదిగూడ పరిధిలోని..ప్రభుత్వ బడులకు బీఆర్ఎస్ అండ
- ఆరుగురు విద్యావాలింటీర్లకు వేతనం
- కిచెన్ షెడ్ల నిర్మాణం, మరమ్మత్తులకు చేయూత
- మాజీ కార్పోరేటర్లు, నాయకులతో కలిసి..
స్కూల్స్ సందర్శించిన మాజీ మేయర్ జక్క
- బీఆర్ఎస్ నాయకుల ఔదార్యంపై ప్రజల హర్షం
మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలోని ప్రభుత్వ పాఠశాలలకు బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పోరేటర్లు, నాయకులు అండగా నిలిచారు. ఆరుగురు విద్యావాలంటీర్ల నియామకం చేసి, వారికి ప్రతి నెల వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అలాగే మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా కిచెన్ షెడ్డుతో పాటు పీర్జాదిగూడ, పర్వతాపూర్ స్కూల్స్‌లలో కిచెన్ షెడ్ల మరమ్మత్తులు చేయిస్తామని హామీ ఇచ్చారు. నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు పుఃన ప్రారంభమైన నేపథ్యంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మేడిపల్లి, పీర్జాదిగూడ హైస్కూల్స్‌ను, పర్వాతాపూర్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అయితే మూడు పాఠశాలలకు కూడా పూర్తి స్థాయిలో అడ్మిషన్లు వస్తున్నప్పటికీ సాంక్షన్ పోస్టులు లేని కారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకం జరగడం లేదని ఆయా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు మాజీ మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మూడు స్కూల్స్‌లలోను ఆరుగురు విద్యావాలంటీర్ల నియామకం చేసి, వారికి ప్రతినెల వేతనం మాజీ కార్పోరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. మేడిపల్లి, పీర్జాదిగూడ, పర్వతాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ షెడ్డు నిర్మాణం, మరమ్మత్తులతో పాటు ఆరుగురు విద్యా వాలంటీర్ల నియామకం, వేతనం బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల మధుకర్, యాసారం శ్రీనివాస్, మునికుంట్ల కిరణ్ గౌడ్ స్వచ్ఛందంగా స్వీకరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఔదార్యంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పేద, మద్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో సకల వసతులు కల్పించాలనే బీఆర్ఎస్ పార్టీ నాయకుల సంకల్పం ఆదర్శనీయమని ఆయా పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో....బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, యూత్ అధ్యక్షులు ప్రభు,మైనారిటీ అధ్యక్షులు జిలాని పాషా, శ్యామల శ్రీనివాస్, ఆంజనేయులు, కోనేటి వెంకట్,బుల్లెట్ శంకర్, అశోక్, మల్లం వెంకటేష్ గౌడ్, పాశం నరేందర్ రెడ్డి, సతీష్, అమర్ పటేల్, రాజు శెట్టి, కోల శ్రీనివాస్, వరికల శ్రీనివాస్, కిరణ్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, అక్షిత్, తిరుమలేష్, రమేష్, శివరాజ్, సుభాన్,సురేష్,
BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR KCR
16/06/2026
10/06/2026
- పీర్జాదిగూడ పరిధిలో పారిశుద్ధ్య పనుల మెరుగుదల, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణంపై జోనల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేసిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మైనారిటి అధ్యక్షులు జిలాని పాషా,ఆకుల మధుకర్ తదితరులు కలిసి ఉప్పల్ జోన్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త IAS, బోడుప్పల్ సర్కిల్ డిప్యుటీ కమీషనర్ ఏ.శైలజ లకు వినతి పత్రం అందజేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజా పర్యటనలో భాగంగా పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపురం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలను సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నామని తెలిపారు.
ప్రధానంగా లేవనెత్తిన అంశాలు:
• పారిశుద్ధ్య లోపాలు – దోమల బెడద:
అంతర్గత కాలనీల్లో క్రమం తప్పకుండా రోడ్లు ఊడ్చకపోవడం, వీధుల మూలల్లో చెత్త పేరుకుపోవడం వల్ల వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
• రోడ్డు స్వీపింగ్ యంత్రాల ఏర్పాటు:
ప్రధాన రహదారుల శుభ్రత కోసం ఆధునిక రోడ్ స్వీపింగ్ మెషిన్లను వినియోగిస్తే పారిశుద్ధ్య సిబ్బంది అంతర్గత కాలనీల పరిశుభ్రతపై మరింత సమయం కేటాయించే అవకాశం ఉంటుందని సూచించారు.
• పాత పారిశుద్ధ్య విధానం అమలు:
గతంలో ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి నిర్దిష్ట ప్రాంత బాధ్యతలు అప్పగించిన విధానాన్ని తిరిగి అమలు చేసి జవాబుదారీతనాన్ని పెంచాలని కోరారు.
• పీర్జాదిగూడ గుట్టలో సీసీ రోడ్ల నిర్మాణం:
పీర్జాదిగూడ గుట్ట పరిధిలోని ఇరుకైన గల్లీలలో సీసీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోవడం, గుంతలు ఏర్పడటం, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున తక్షణమే సర్వే నిర్వహించి సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, తమ హయాంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, స్ట్రీట్ లైట్లు, మంచినీటి పైప్‌లైన్లు, నల్లా కనెక్షన్లు వంటి అనేక మౌలిక సదుపాయాలను ప్రజలకు అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు, పారిశుద్ధ్య సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ప్రజారోగ్యం, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జోనల్ కమిషనర్‌ను కోరారు.
BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR KCR Vijayalaxmi Gadwal, GHMC MAYOR
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Address
Peerzadiguda Municipal Corporation
Hyderabad
500098