Valluri Raghava
Megastar in Universe
07/02/2026
With Parabathini Hemalatha – I just got recognized as one of their top fans! 🎉
రాసే ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు.కానీ ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే!
24/12/2025
---ఈ చెట్ల పూలు నిప్పులు కురిపి స్తాయి---
కవిత్వం విశ్వమానవ ప్రేమను కాంక్షించే ఒక సృజనాత్మక పరికరం మాత్రమే కాదు... అంతర్జాతీయ ఉత్పాతాలను హృద్యంగా చాటే మెత్తటి ఆయుధం కూడా . కవిత్వం విశ్వమానవ ప్రేమను కాంక్షించే ఒక సృజ నాత్మక పరికరం.. దాని వెనుక దాగిన మానవీయ స్పందన దేవుడి వోదార్పు అనిపిస్తుంది కొందరి కవితలు చదివితే ... అలాటి అక్షరాలే గార శ్రీరామ్మూర్తి గారి బూడిద చెట్ల పూలు ... వెన్నడే వాక్యాల తో కవాతు చేస్తు వెంటాడిన విషాదం వెనుక కుట్రల రహస్యాలను కళ్ళకు కట్టించిన బృందగానం లాటి కవన సంకలనం ఈ బూడిద చెట్లు కవితా కదంబం. .మహామనవ విషాదాన్ని మాటల్లో కుదించిన వుద్వేగ భరిత గేయాల రోదన ఈ సంకలనం లో ప్రతి అక్షరం. . శైలిలో శిల్పంలో చమత్కారంతో కూడిన పద సృస్టి లో ఒక చమత్కారం ఆద్యంతం మనని వెంటాడుతుంది. కరోనాచితిలో దగ్దమైన లక్షలాది బూడిద చెట్ల ను అక్షరాలుగా మార్చి రాసిన భయానక కవితా హర్రర్ ఈ రచన.. కార్పరేట్ వ్యాపార పల్లకిల దుమ్ము తుడుచుకుని బతికే నీచ పాలకుల వుక్కు పాదాలకింద గడ్డ కట్టిన శీతల రక్తల నిశీధి రోదనను అనువదిస్తే ఇందులోని ఒక్కో కవిత అవ్తుంది. ఆయన కవితావేశం ఎప్పుడూ సామాజిక ప్రగతిశీల ఉద్యమాలతో ముడిపడి ఉన్నదే. ప్రపంచీకరణ గురించి తన కవిత్వంలో ఎంతో ఆవేదన వెల్లువై మనమీ వేడెక్కిస్తుంది. దోపిడి పైన నిర్లక్ష్యం పైన అమాననవీయత తనలో నిత్యవేదనని రగిలించే భావాలను కవితలుగా మార్చి సమాజంపై ఎక్కుపెట్టారు శ్రీరామూర్తి . సమాజంలో జరిగే ప్రతి మార్పు లో దాగిన రూపమూ, సన్నివేశమూ ఆయన కవితావస్తువై ప్రతిబింబింబిస్తుంది. .అది రాగమైన రోగమైన వేదమైన వాదమైనా... కవిత్వాన్ని నిత్యనూతనం చేయడంలో కొత్త కొత్త కవితా రూపాలు అవసరమే. అలాగని ఆ రూపాలు కవిత్వాన్ని ఎక్కువ మందికి అందిం చకుండా పోకూడదు. ఆ రహస్యం బాగా ఎరిగిన్న గొప్ప రచయిత శ్రీరామూర్తి. కవిత్వం రాయడం కొందరికి మాత్రమే సాధ్యమనే భ్రమ ఆయన కవిత్వం ఏనాడూ పెంచలేదు. సాహిత్య విలువల్ని కాపాడుకొంటూనే, కాలానుగుణంగా వచ్చే ప్రక్రియల్ని సొంతం చేసుకొంటు కొన్ని నియమాల్ని సరళీకరించుకుంటూ సరికొత్త ట్రెండ్ ను ఆయన కవితాధోరణి సృస్టించింది. ఈ ప్రయోగాలు ప్రయత్నాల విశ్వ రూపం బుడిద పూల చెట్లు లోని ప్రతికవితలో చూడగలమ్. మొత్తమ్ 90 కవితల సమాహారంగా పూసగుచ్చిన ఈ పూలనినిండా ఆవేదన ఆవేశం ఆక్రోశం ఆలోచనగా మారి చదువరిని కదిలిస్తుంది. శాస్త్రీయమైన మానవీయకోణం. మానవుణ్ణి కేంద్రంగా చేసుకోవడంతో పాటు హేతు పూర్వకమైన రసస్పందనతో ఆయన కవిత్వం పరిగెడుతుంది. . ఆధునికకవిత్వం, అదీ వచన కవిత్వంలో నియమాలు పాటించరని కాదు గానీ, వాటి కంటే, స్వేచ్ఛకీ, సహజ స్పందనకీ ప్రాధాన్యాన్నిస్తూనే, సాహిత్యంలో ప్రయోగాల్నీ చేస్తూ కాలానుగుణ మైన వస్తువుని స్వీకరించడం ఆయన విసిస్టత.. శ్రీరామమూర్తి సాత్విక స్వభావి. నైతిక విలువలతో నిండారిన, సార్ధక జీవితం ఆయనది. హేతు చింతనతో కూడిన జిజ్ఞాస ఆయన రచనల్లో వెల్లివిరుస్తుంది. వ్యక్తిగత నమ్మకాలతో సంబంధం లేకుండా శాస్త్రీయ దృష్టితో చరిత్రని, సాహిత్యాన్ని, సమాజాన్ని సమీక్షించడం శ్రీరామూర్తి గారి ప్రత్యేకత. కవులు అప్పుడప్పుడూ తమ కవిత్వ తత్వాన్ని ఏదో ఓ కవితలో నిర్వచించుకొంటారు . వాళ్ళేం వ్రాస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఇదొక స్వీయ పరిశీలన లేదా ఎరుక.ఆయన ఈ సంకలనంలో రాసిన తరుణోపాయం కవిత ముద్దులసాగు ను నోట్లముద్రణా యంత్రం ఎలాచేయదలచుకున్నాడో గుండె విప్పి చెబుతాడు. మనదేశ మానవుడి నిస్స హాయతకు పరకాస్టఈ కవిత .ఇక తెల్లని చీకటి కవిత మరో భాయోత్పాత సన్నివేశానికి ప్రతీక .ఇక మరియమ్మ కవితలో లాటి సామాజిక లూటీ గా ఎలామారినదో చెప్పిన శైలి మహాద్భుతం ... ఈ సంకలనం లో అనేక కవితలు అద్భుతమైన పదచిత్రాలతో అలరాలుతుంటాయి. ఆయా పదచిత్రాలు కూడా చక్కని సందర్భశుద్ధి, పొందికతో అమరి అపూర్వమైన పఠనానుభూతిని కలిగిస్తాయి.. పోస్ట్ మోడ్రన్ కవిత్వానికి మెటానిమీ వెన్నెముక వంటిది. కానీ మెటానిమీ వాడటం కత్తిమీద సాము. కవి వార పత్రిక ఉద్దేశించిన భావాల్ని చదువరి అందుకోలేక పోతే ఆ కవిత అస్ఫష్టలోయలోకి జారినట్లే.. అయితే ఆ ఇబ్బంది కలగించకుండా ఒక మెట్టు దిగి వస్తూనే పాటకుడి కి ఆకాశం అంచులు తాకే అనుభూతి ఇస్తాడు ఎన్నో కవితలలో . గీతభోధ కవిత అద్భుతమిన ఆత్మ వ్యక్తీకరణకు మహోన్నత ప్రతీక ..పోటీలో క్వాలిటీ ని వెతికే డ్యూటి వెనుక దాగిన దుస్సంప్రదాయపు లోతులను చాటుతుంది. ఆయన కవిత్వంలో పదచిత్రాల సౌందర్యం పరిమళిస్తూంటుంది. పదచిత్రాల్ని ఎవరైనా కల్పన చేయగలరు. కానీ ఒక దృశ్యాన్ని నలుగురూ చూసే దృష్టితో కాక కొత్తగా దర్శించి దాన్ని యద చిత్రంగా మలచటం శ్రీరామమూర్తికే గారికే చెల్లింది.ఉలా బూడిద చెట్ల పూలు విరజిమ్మే పరిమళాలు ఎన్నెన్నో .-
-వల్లూరి రాఘవరావు. పూర్వ సంపాదకుడు ఆంద్రప్రభ
కోపం, తుఫాను రెండూ ఒకేవిధంగా ఉంటాయి. శాంతించిన తర్వాతనే తెలుస్తుంది ఎంత నష్టం జరిగిందో?
వినయం ఆభరణమ్ కాదు ఆయుధం
చేసే ప్రతిపని ఆరాధనా భావం తో అంకితం అయి చేయడమే అసలైన పూజ
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Hyderabad
500 ###, 501 ###, 502 ###.