Apallnews.com

Apallnews.com

Share

The Heart of Andhra Pradesh. Dare to Write...... New generation online media of Andhra pradesh.

Andhra Pradesh Politics, Movies, Reviews, Gallery, Women, Kids news in Telugu......

22/01/2014

...:->నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (91) అస్తమయం

ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు (91) అస్తమించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక 2.45 గంటలకు బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నిన్న అర్ధరాత్రి దాటినా తరువాత 2.00 గంటల సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆయనను వెంటనే కేర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీకి తరలించి ఆక్సిజన్ పెట్టారు. తరువాత పదినిమిషాలకే డాక్టర్ సోమరాజు వైద్యుల బృందం పరిశీలించగా అప్పటికే శ్వాస ఆగిపోయినట్టు గుర్తించి కుటుంబసభ్యులకు తెలిపారు.

తుది క్షణాలలో కుమార్తె నాగసుశీల, మనవడు సుశాంత్ ఆయన పక్కనే ఉన్నారు. అక్కినేని గత కొంతకాలంగా పేగు కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేస్తూ, తను కేన్సర్ వ్యాధిని జయిస్తానని, ఎంతో ఆత్మవిశ్వాసంతో తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి ఆ భాగాన్ని తొలగించి, కీమో థెరపీ చికిత్సనందిస్తున్నారు. ఇక అప్పటినుంచి ఆయన చక్రాల కుర్చీలోనే తిరుగుతున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ ఆయన కుమారుడు ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Photos 23/10/2013

...:-> ఫేస్ బుక్ లో చేరిన ప్రభాస్..24 గంటల్లోనే 60 వేలకు పైగా లైకులు

యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ ఫేస్బుక్లో సంచలనం సృష్టిస్తున్నాడు. అతడు ఫేస్బుక్లో ఎకౌంట్ తెరిచిన 24 గంటల్లోనే 50 వేలకు పైగా లైకులు వచ్చాయి. వీటి సంఖ్య సెకను సెకనుకు పెరుగుతోంది. ' ఇది నా అధికారిక ఫేస్బుక్ పేజీ. దీనితో అభిమానులకు అందుబాటులో ఉంటా. నా గురించి, నా సినిమాలకు సంబంధించిన సినిమాల సమాచారం ఎప్పటికప్పడు ఆప్డేట్ చేస్తాను' అంటూ ప్రభాస్ తన ఫేస్బుక్ పేజీలో మెసేజ్ పెట్టాడు. రేపు(అక్టోబర్ 23) ప్రభాస్ 34వ జన్మదినం జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా 'బాహుబలి' షూటింగ్కు సంబంధించిన నిమిషం నిడివి వున్న టీజర్ను విడుదల చేయనున్నారు. ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ కి https://www.facebook.com/ActorPrabhas ద్వారా యాక్సస్ అవ్వచ్చు!

19/10/2013

......:->ధారుణమైన స్టేట్‌మెంట్ ఇచ్చిన హ‌రీష్‌శంక‌ర్‌
మూవీను డైరెక్ట్ చేయ‌డంతో ఆ డైరెక్టర్ ప‌ని అయిపోదు. దాన్ని ప్రమోట్ చేసుకోగ‌ల‌గాలి, త‌ప్పు జ‌రిగినా స‌మయం వ‌చ్చే వ‌ర‌కూ వేచి ఉండాలి. ఇవేమి హ‌రీష్ శంక‌ర్‌లో క‌నిపించ‌లేదు. బ్లాక్‌బ‌స్టర్ మూవీను టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు అందించిన అనుభ‌వం ఉన్న డైరెక్టర్‌గా హ‌రీష్ మాటల్లో క‌నిపించ‌లేదు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే యంగ్ టైగ‌ర్ మూవీపై ప్రెస్ మీట్ పెట్టిన హీరీష్ ఈ విధంగా మాట్లాడాడు.

'రామ‌య్య వ‌స్తావ‌య్యా మూవీను అక్టోబ‌ర్‌9న ఎన్టీఆర్ ఫ్యామిలి చూసింది. సెకండ్ ఆఫ్‌లో ఇంత‌గా యాక్షన్ ఉందేంటి అన్నారు. మొత్తంగా చెప్పాలంటే మూవీ రిజ‌ల్ట్ ఆశించినంత ఆశాజ‌న‌కంగా లేదు. ఇది అందరూ ఒప్పుకోద‌గ్గ విష‌యం. మూవీ ఎందుకు చూడాల‌ని అని ఎవ‌రైనా అనుకున్నవాళ్ళకు నేను ఒక్కటే చెబుతున్నాను. ఇప్పటి వ‌ర‌కూ ఎవ‌రూ చూపించ‌ని స్పెయిన్ లొకేష‌న్స్‌ చూడాల‌న్నా, య‌న్టీఆర్‌లోని కొత్త కోణాన్ని చూడాల‌న్నా, ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌ను చూడాల‌న్నా మూవీను త‌ప్పకుండా చూడండి' అని అన్నాడు.

ఈ త‌ర‌హా మాట‌లు రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీ క‌లెక్షన్స్‌పై, మూవీను చూడ‌బోయో ప్రేక్షకుల‌పై బ‌లంగా ప్రభావితం చేస్తాయ‌ని టాలీవుడ్ స్పష్టంగా చెబుతుంది. ఒక డైరెక్టర్ ఏమి మాట్లాడ‌కుడ‌దో అది మాట్లాడి మూవీ పూర్తిగా ఫెయిల్యూర్ అయింద‌ని రీలీజ్ అయిన వారం రోజుల‌కే చెప్పడం అనేది మంచి విధానం కాదు. ఇక‌నైన రీలీజ్ అయిన మూవీల గురించి ఎన్ని రోజుల‌కు స్టేట్‌మెంట్ ఇవ్వాలో తెలుకోవాల‌ని అభిమానుల సైతం ఆవేద‌న చెందుతున్నారు.

17/10/2013

......:->గవర్నర్ను కలిసిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాజభవన్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. జగన్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కూడా గవర్నర్ను కలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను వెంటనే సమావేశపరచాలని జగన్ ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
కాగా రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర కేబినెట్ నోట్‌కు ఆమోదముద్ర పడకముందే రాష్ట్ర అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్యం కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇదివరకు గవర్నర్‌కు ఒక వినతిపత్రం అందజేయడం తెలిసిందే. అయితే తెలంగాణ అంశంపై అసెంబ్లీ తీర్మానం కోరడం లేదన్న విషయం రూఢి అయిపోయి కేవలం అభిప్రాయానికి మాత్రమే బిల్లును పంపుతారని తేలిపోయిన నేపథ్యంలో మరోసారి జగన్ ....గవర్నర్తో భేటీ అయ్యారు.

Photos 17/10/2013

......:->జగన్ ను కలిసిన సినిమా యూనిట్!
సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రూపొందుతున్న 'జై బోలో సమైక్యాంధ్ర' చిత్రం యూనిట్ కి వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు పూడి లక్ష్మణ్, నిర్మాత పూడి వెంకట్రావు, రహమతుల్లా, రంగంపేట గోపాల్ రెడ్డి, గోవిందరాజులు, శివకుమార్, అనంతపురం ఎమ్మెల్యే ఆర్. గురునాథరెడ్డి తదితరులు తాజాగా జగన్ ను కలిసి తమ చిత్ర విశేషాలను తెలిపారు.ఈ సందర్భంగా వారి ప్రయత్నాన్ని జగన్ మనస్పూర్తిగా అభినందించారు. ఇదిలా ఉంచితే, ఇటీవల విశాఖ, విజయనగరం ప్రాంతాలలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమ ఘటనలను ఈ చిత్రం యూనిట్ యధాతథంగా చిత్రీకరించింది. చిత్రం తదుపరి షెడ్యూలును అనంతపురంలో నిర్వహిస్తామని నిర్మాత తెలిపారు. ఆడియో వేడుకను కూడా అక్కడే జరుపుతామని చెప్పారు.

16/10/2013

వైఎస్ జగన్ సమైక్య శంఖారావం సభకు అనుమతి
హైదరాబాద్ :ఈనెల 19న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ సభకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి అయిదు గంటల వరకూ సభ నిర్వహించుకోవచ్చని తెలిపింది. సమైక్య శంఖారావానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.

డీసీపీ కమలాసన్ రెడ్డి ఉత్తర్వులను కొట్టివేసి, తమ సభకు అనుమతి మంజూరు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఈరోజు ఉదయం తీర్పు వెల్లడించారు.

Photos 16/10/2013

......:-> ముస్లిం సోదరులకు మా బక్రీద్ శుభాకాంక్షలు

Photos 15/10/2013

...:->ప్రభాస్ పుట్టిన రోజుకు రాజమౌళి సర్ ప్రైజ్
దర్శకుడు రాజమౌళి హీరో ప్రభాస్ పుట్టినరోజును ‘బాహుబలి’ సినిమా ప్రమోషన్ కు వాడుకుంటున్నాడు. తన సినిమాలకు ప్రచారం కల్పించడానికి వెరైటీ మార్గాలను అన్వేషించే దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమా విషయంలోఒక కొత్త పద్దతిని అనుసరిస్తున్నాడు. గతంలో విడుదలకు ముందే ‘ఈగ' మూవీ స్టోరీని లీక్ చేసిన రాజమౌళి ఈ సారి బాహుబలి చిత్రం మేకింగ్ వీడియోలను అంచలంచలుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. ‘బాహుబలి' చిత్రం తొలి మేకింగ్ వీడియోను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట మన తెలుగు తెర జక్కన్న.

ఈ మేకింగ్ వీడియో ఒక నిమిషం వ్యవధిలో ఉంటుందని అంటున్నారు. బాహుబలి సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఈ మేకింగ్ వీడియో ను రూపోందించారట. ఈ సినిమా షూటింగ్ పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటి వరకు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గకుండా ఉండటానికే ఈ ప్లాన్ చేసాడట రాజమౌళి. రాజమౌళి కి ఇచ్చిన మాటకోసం తన పెళ్లితో పాటు ఎవ్వరినీ కలవకుండా మరెక్కడికి వెళ్ళకుండా ప్రభాస్ చేస్తున్న అజ్ఞాతవాసానికి దర్శకుడు రాజమౌళి ఈ బహుమతిని ఇచ్చి ప్రభాస్ కు మరింత క్రేజ్ తీసుకొచ్చి ప్రభాస్ పడుతున్న కష్టానికి గుర్తింపుగా ఈ బహుమతి ఇస్తున్నాడు అనుకోవాలి.

దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మింప బడుతున్న ‘బాహుబలి’ ప్రభాస్ రాజమౌళిల అంచనాలు ప్రకారం సూపర్ హిట్ అయితే ప్రభాస్ టాలీవుడ్ నంబర్ వాన్ స్థానానికి అతి చెరువులో ఉంటాడు...

Photos 13/10/2013

స్నేహితులకు, బందువులకు, మన తెలుగువారందరికీ విజయదసమి శుభాకాంక్షలు....

Photos 11/10/2013

...:->మళ్లీ 'సుడిగాడు' జంట వస్తోంది
ఆమధ్య వచ్చిన 'సుడిగాడు' సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచి విజయం సాధించిన సంగతి మనకు తెలుసు. ఇందులో హీరో హీరోయిన్లుగా జోడీ కట్టిన అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ మళ్లీ ఇప్పుడు మరోసారి జతకడుతున్నారు. నరేష్ హీరోగా ఇ. సత్తిబాబు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా మోనాల్ గజ్జర్ ను ఎంచుకున్నట్టు సమాచారం. అంబికా కృష్ణ నిర్మించే ఈ చిత్రం షూటింగు త్వరలో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Photos 11/10/2013

...:->హిందీలోకి కూడా 'రామయ్య'
యువ దర్శకుడు హరీష్ శంకర్ త్వరలో బాలీవుడ్ వెళ్ళే ఆలోచన చేస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ తో తాను తీసిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని అక్కడ రీమేక్ చేసే ఉద్దేశంలో వున్నాడు. ఇప్పటికే ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను అమ్మడం జరిగిందనీ, వాటిని తీసుకున్న నిర్మాత హిందీలో కూడా హరీష్ నే దర్శకత్వం వహించమని అడుగుతున్నాడనీ అంటున్నారు. హరీష్ కూడా దీనిని రీమేక్ చేయడానికి ఆసక్తిగా వున్నాడు. గతంలో తను తీసిన 'మిరపకాయ్' చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయమని ఈయనను అడిగినప్పటికీ, తెలుగులో ఇతర కమిట్ మెంట్లు వుండడం వల్ల చేయలేకపోయాడు.

Photos 11/10/2013

...:->మహేష్ బాబుతో త్రివిక్రమ్?
తాజాగా 'అత్తారింటికి దారేది' సినిమాతో పెద్ద హిట్టు కొట్టిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేనట్టు కనిపిస్తోంది. ఈ దర్శకుడితో చేయడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు రెడీగా ఉన్నప్పటికీ, త్రివిక్రమ్ మాత్రం వేరేగా ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తన మిత్రుడు మహేష్ బాబుతో చేయాలన్నది అతని కోరికగా కనిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'అతడు', 'ఖలేజ' సినిమాలు వచ్చాయి. వీటిలో 'అతడు' ఓకే అనిపించుకున్నప్పటికీ, 'ఖలేజ' మాత్రం దారుణంగా ఫెయిలైంది. అయినప్పటికీ త్రివిక్రమ్ పట్ల మహేష్ నమ్మకం మాత్రం ఏ మాత్రం సడలలేదు. అలాగే, త్రివిక్రమ్ అభిమానించే ఇద్దరు హీరోల్లో మహేష్ ఒకరు. అందుకే, మహేష్ తోనే చేసి, మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడట. అందుకోసం ప్రస్తుతం స్క్రిప్ట్ తయారుచేసే పనిలో పడ్డాడని సమాచారం.

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Hyderabad