Vemudala Rani

Vemudala Rani

Share

Munugodu constituency convener(BSP)

26/03/2024

అందరికీ నమస్కారం🙏 జై భీమ్! ఈ మధ్య బిఅరెస్ లో చేరిన డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి పట్ల, వారి నిర్ణయం పట్ల చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు చెపుతున్నారు. ఐతే, ఆయనను జడ్జి చేసే ముందు ఆయన ప్రస్థానాన్ని,ఆయన ఇప్పుడు చెప్తున్న మాటలను మనం గమనించాలి.
ఆయన నిజంగానే స్వార్థపరుడైతే ఆ రోజే బిఆర్ ఎస్ లో చేరి మంత్రి అయ్యేవాడు. అసలు ఉనికిలో ఉందో లేదో తెలియని బిఎస్పీ లో చేరి ఎర్రటి మే నెల ఎండల్లో, వరదలు వస్తున్న సమయాల్లోనూ బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగించే అంత అవసరం ఆయనకు లేదు. పోనీ, తాను కేసీఆర్ వదిలిన బాణమే అయితే అన్ని నియోజకవర్గాల్లో బిఎస్పీ తరపున నిలబెట్టిన అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేయాలి. అలా చేసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి బిఅరెస్ మళ్ళీ ప్రభుత్వంను ఏర్పాటు చేసి ఉండేది. కానీ, అలా జరగలేదు. అంటే ఆరేస్ ప్రవీణ్ కుమార్ మొదటి నుండీ బిఅరెస్ మనిషే అనేది ఒక కుట్ర సిద్ధాంతం.
ఇక , తనకు పదవే కావాలనుకుంటే ఇప్పటికి కాంగ్రెస్ నుండి ఎంపీ టికెట్ తెచ్చుకోవడమో, లేదా ఎమ్మెల్సీ లాంటి పదవులు తెచ్చుకోవడమో పెద్ద విషయం ఏమీ కాదు.
ఇక, బీఎస్పీకి రాజీనామా విషయానికి వస్తే మాయావతి గారు ఈ దేశంలో బహుజన ఉద్యమ గొంతుక అనడంలో సందేహం లేదు.ఐతే, బిజెపి ఎవరినైనా ఇరికించి రాజ్యాంగ బద్ద సంస్థలను ఉపయోగించి అరెస్ట్ చేయించగలదు. ఒక వేళ బెహేన్జీ అరెస్ట్ ఐతే ఆధిపత్య వర్గ మీడియా మిగిలిన వారి కంటే ఎక్కువ ప్రచారం చేస్తుంది. దానితో పాటు, మరొక నాయకులు ఆ పార్టీ లో లేకపోవడం, దేశవ్యాప్తంగా బహుజన ఉద్యమాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుంది. కాబట్టి అనివార్యంగా, బిఎస్పీకి ఉత్తర ప్రదేశ్ లొనే మనుగడ ప్రమాద కరమైన ఈ సమయంలోలో బెహేన్జీ బిజెపి ని ఎదురుగా ఢీ కొట్టడం సరైన వ్యూహం కాదని భావిస్తుందని ఆమె తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలే మనకు స్పష్టం చేస్తున్నాయి. బహుశా, కాంగ్రెస్, బీజేపీ కూటములు కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీల తో పొత్తు కు అనుకూలంగా ఉన్న బిఎస్పీ విధానం ప్రకారమే బిఅరెస్ తో ప్రవీణ్ కుమార్ ప్రయత్నించగా దానిని కూడా బెహేన్జీ తిరస్కరించడంతో ప్రవీణ్ కుమార్ కు తన లక్ష్యమైన బహుజన వర్గ ప్రయోజనాలను కాపాడాలనే, బహుజనుల గొంతుకగా నిలబడాలనే ఆశయం బిఎస్పీ వేదికగా అసాధ్యం అని స్పష్టం అయి ఉంటుంది. తన ట్వీట్ లో కూడా పార్టీని గాని, మాయవతిని గానీ ప్రవీణ్ కుమార్ గారు విమర్శించకపోవడం విశేషం.
తను ఇప్పుడు చెప్తున్న మాటల ప్రకారం వారు మార్చింది జెండా మాత్రమే కానీ ఎజెండా కాదు. తాను అధికారిగా ఉన్నపుడు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపని సాంఘిక సంక్షేమ గురుకులాలకు కావాలని వెళ్లారు. రాజకీయాల్లోకి వచ్చాక ఉనికిలో పెద్దగా ఉందొ లేదో తెలియని బిఎస్పీ లోకి వెళ్లి బహుజన వాదం గురించి గ్రామాల్లో కూడా చర్చ జరిగేలా చూసారు. ఇప్పుడు అందరు బిఅరెస్ ను వీడుతున్న సమయంలో బిఆర్ ఎస్ లో చేరారు. తానెప్పుడూ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ నిర్ణయం తీసుకోలేదని కేవలం బహుజన వర్గ ప్రయోజనాల కోసమే బిఅరెస్ లో చేరానని పదే పదే చెప్తున్నారు. నిజంగానే ప్రవీణ్ కుమార్ గారికి తాయిలాలకు లొంగే స్వభావమే ఉంటే ఆయన కాంగ్రెస్ లోనే చేరి ఉండే వారు.
ఈ పరిణామాలని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే బహుజన వర్గాలకు మంచి జరగాలంటే ప్రవీణ్ కుమార్ ముందున్నవి రెండు మార్గాలు. ఒకటి, ప్రభుత్వాన్ని సొంతగా ఏర్పాటు చేయడం. లేదా, బలమైన ప్రతి పక్షంగా ఉండి ప్రభుత్వాలను పని చేయించేలా చూడడం. బిఎస్పీకి అటు సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం గానీ బలమైన ప్రతిపక్షంగా ఉండగలిగే అవకాశం గానీ కనబడడం లేదు. కాబట్టి, బలమైన ప్రతిపక్షంగా ఉన్న బిఅరెస్ లో చేరి బహుజనుల సమస్యలపై గొంతెత్తడం ప్రాక్టికల్ గా సరైంది అని ప్రవీన్ కుమార్ భావించి ఉండవచ్చు.
అందుకు అనుగుణంగానే "ఇక నుంచి మన నినాదాలు జై భీమ్ మరియు జై తెలంగాణ" అంటూ తెలంగాణ భవన్ వేదికగా బాల్క సుమన్ లాంటి కేసీఆర్ వీరవిధేయుడు చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ కూడా తన ట్వీట్ లో "జై భీమ్, జై తెలంగాణ" అని ప్రస్తావించడం, వారి అధికారిక సోషల్ మీడియా బిసి లకు ఎక్కువ ఎంపీ సీట్లు కేటాయించడం గురించి రాస్తూ బిఅరెస్ ను "బహుజన రాష్ట్ర సమితి" అని అభివర్ణించడం ఆ పార్టీ మార్చుకున్న వైఖరి గురించి, బహుజన వాదం ఎజెండాగా పని చేయబోతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ ప్రవీణ్ కుమార్ ప్రభావమే అని మనం అర్ధం చేసుకోవచ్చు.
ఏది ఏమైనా ప్రవీణ్ కుమార్ నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరిచినా ఇప్పుడే వారి నిర్ణయాన్ని తప్పు పట్టడం తొందర పాటు అవుతుంది.షేక్స్పియర్ రాసిన 'జూలియస్ సీజర్' నాటకంలో అందరూ 'సీజర్' అనే యుద్ధ వీరుణ్ణి తన స్నేహితుడైన బ్రూటస్ తో సహా అందరూ అపార్థం చేసుకొని చంపేస్తారు. ఆ తర్వాత ఆంటోని అనే మరో స్నేహితుడు సీజర్ గొప్పతనం గురించి చెప్తే గానీ ప్రజలకు సీజర్ ఆశయాలు అర్థం అవలేదు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ కు శత్రువుల కంటే తనను వ్యతిరేకిస్తున్న బ్రూటస్ లాంటి మిత్రులతోనే ప్రమాదం ఎక్కువైంది. చివరగా అందరూ వేచి చూడాల్సింది ప్రవీణ్ కుమార్ బిఅరెస్ వేదికగా ఎలా పని చేయబోతున్నాడు అని. కనీసం విభేస్తున్న ప్రవీణ్ కుమార్ అభిమానులైన అప్పటిదాకా వారిపై జరుగుతున్న ఈ వ్యక్తిత్వ హననాలను మరొక ఆంటోని లాగా మారి అపాల్సిన అవసరం ఉంది. జై ఫూలే. జై భీమ్.

22/03/2024

నా మీద నమ్మకంతో రానున్న పార్లమెంటు ఎన్నికల సమరంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత శ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.🙏
నేను మీ నమ్మకాన్ని వమ్ముచేయను.
పేద ప్రజలకిచ్చిన మాట తప్పను.

శ్రేయోభిలాషులకు ఒక ప్రార్థన🙏:
నా రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్ములను బాధ పెట్టి ఉోండవచ్చు. నాకు కూడా బాధగానే ఉంది. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవు.

అయితే విషయాన్ని అర్థం చేసుకోకుండా, నా మీద సోషల్ మీడియా వేదికగా కొన్ని శక్తులు (కొంత మంది ఆప్తులతో సహా!) తీవ్రమైన దాడి చేసినయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి అనాగరికమైన దాడులు నాకు కొత్త కాదు. నన్ను, పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న నా లక్ష్యం నుండి ఈ చిల్లర దాడులు దూరం చేయలేవు.👊

నన్ను దయచేసి నమ్మండి🙏
నేను ఇన్నాళ్లూ నిస్వార్థంగా పీడిత ప్రజలకోసమే పనిచేశాను. చట్ట సభల్లో కూడా మీ గొంతుకగా ఉండాలనే లక్ష్యంతో ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం వదలి రాజకీయాల్లోకి వచ్చాను. అసెంబ్లీలో బహుజనుల గొంతుకగా ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించినా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను.

తెలంగాణ వాదం -బహుజనవాదం రెండూ ఒకటేనని నమ్మి ఎంతో శ్రమించి శ్రీ కేసీఆర్ మరియు బెహన్జీ మాయావతి గార్లను ఒప్పించి తెలంగాణలో చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చివరి నిమిషంలో రద్దయినప్పటికీ, ఇచ్చిన మాట మేరకు విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం, భారత రాజ్యాంగ విలువల రక్షణ కోసం, కేసీఆర్ గారితోనే కలసి ప్రయాణించాలనుకున్నాను. బీజేపీ కుట్రల నుండి దేశాన్ని రక్షించే ధమ్ము-ధైర్యం కాంగ్రేసుకు ముమ్మాటికీ లేదు. అోందుకే నేను ఇటీవలే భారాసలో చేరాను.

ఈ యుద్దంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో సర్వశక్తులొడ్డి విజయం కోసం పోరాడతాను. దయచేసి మీరు కూడా నాతో రండి. మీకు చేతనైన సాయం చేయండి. మీ విలువైన సమయమివ్వండి. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి వచ్చి ‘కారు’ గుర్తుకు ఓటెయ్యమని ఇంటింటికి ప్రచారం చేయండి. లేదా మీకు తెలిసిన వారికందరికీ కనీసం ఫోన్ చేసయినా చెప్పండి.

నేను చట్టసభల్లో కూర్చుంటే మీరందరూ అక్కడ కూర్చున్నట్లే….
నేను నేను కాదు…నేను మీరే…
మనమందరమూ…🙏

ఛలో నాగర్ కర్నూల్✊

జైభీం…జై తెలంగాణ..జై భారత్

x.com

26/02/2024

Super explanation.

21/01/2024

రామరాజ్యం గొప్ప రాజ్యం అని సుఖసంతోషల్లతో, ధర్మంతో వర్ధిల్లింది అని ఇతిహసలు చాలా గొప్పగా చెప్తున్నాయి కదా..!
మరి,
1)బిల్కిస్ బానో దోషులని విడుదల చెయ్యటం రామరాజ్యం అంగీకరిస్తదా..?
2)మైనారిటీ అని ఒక 8 ఏళ్ల అమ్మాయిని అన్యాయంగా చంపితే రామరాజ్యం అంగీకాస్తదా..?
3) కుల, మతాల పేరుతో చంపుటన్ని రామరాజ్యం అంగీకరిస్తదా..?
4) హత్యలు చేసినోళ్ళకి టిక్కెట్లు ఇవ్వటాన్ని రామరాజ్యం అంగీకరిస్తదా..?
5) ఒక అమ్మాయిని వారి తల్లిదండ్రులు కడసారికి కూడా నోచుకోకపోవటన్ని అర్ధరాత్రి దహనం చెయ్యటన్ని రామరాజ్యం అంగీకరిస్తదా..?
6)ప్రజలంతా కష్టాలు పడుతూ సతమతమవ్వటన్ని రామరాజ్యం అంగీకరిస్తదా..?
7) మతాల, కులాల పేర్లతో తలలు తెగిపడటన్ని రామరాజ్యం అంగీకరిస్తదా..?
8) ఇచ్చిన మాటలు, వాగ్దానలు తుంగలో తొక్కటాన్ని రామరాజ్యం అంగీకరిస్తదా..?
9)ఇతరుల మీద నిత్యం విద్వేషం చిమ్మటాన్ని రామరాజ్యం అంగీకరిస్తదా..?
10)ప్రశ్నిస్తే నిర్భదించటన్ని రామరాజ్యం అంగీకరిస్తదా..?
11) బుల్ డోజార్ రాజకీయాన్ని, కక్షసాధింపులని రామరాజ్యం అంగీకరిస్తదా..?
ఇవే కాకుండా ఇంకెన్నో ఉన్నాయి, మీరు చేసే పనులన్నీటిని రామరాజ్యం అంగీకరిస్తదా..?

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad