rr_keesari

rr_keesari

Share

నా కవితలు

10/07/2025

కలలా కరిగేనా జరిగే కథలన్నీ
మరలా చిగురించేనా నూతన కథలన్నీ
పాత్రలెన్ని మారినా కథనం మారట్లేదుగా
ఆశ స్వార్థం నయనములై రేపటి కొరకు దారి చూపగా
పడుతూ లేస్తూ పసిపాపల్లె పరిగెడుతున్నాం
అజ్ఞానపూట౦న్ధకారంలోకి నిత్యనూతనంగా

05/06/2025

అర్థం చేసుకునే అర్తాంగి మన స్వంతమైతే
చింత లేని జీవితం మన చెంతనున్నట్టే.

అలాంటి ఒక తోడువి నీవై నాతో చేరి
మరింత మధురంగా మనోహరంగా ఈ
అనుబంధాన్ని బందిస్తున్న భాగస్వామికి
పుట్టినరోజు శుభాకాంక్షలు

03/02/2023

మనకి ఎవరైతే ఎక్కువ విలువ ఇస్తారో
వారిని తేలిగ్గా చూడటం తెలియకుండా మనలో చాలా శాతం చేసే పనే ఎందుకంటే ఎంత విలువైన సంపద మన చెంతనున్న అది సరిపోదన్న చింత ఉన్న తత్త్వం

03/02/2023

ఎదుటి వారు ఇబ్బంది పడుతారేమోననుకొని
నీవు ఇబ్బందిపడటం =
నీవు చేయని తప్పుకి నీకు నువ్వే శిక్ష వేయించుకోవడం లాంటిది

02/11/2023

నా అనుభవం ప్రకారం పని 3 రకాలు
అంతస్థు, అవసరం, ఆసక్తి.

అంతస్థు కోసం ఉద్యోగం చేసేవారికోసం ఎప్పుడు ఒక కుర్చీ కాలిగా ఉంటుంది

అవసరం కోసం చేసేవారు ఎప్పుడు ఉద్యోగం వెనికే పరిగెత్తాల్సొస్తుంది

ఆసక్తితో చేసేవారికోసం ఉద్యోగమే పరిగెడుతుంది

నిజం చెప్పాలంటే అంతస్థు లేదా ఆసక్తి తో చేసేవారికన్నా అవసరం కోసం చేసే వారి సంఖ్యయే చాలా ఎక్కువ!!!

- రంజిత్

02/11/2023

మనం ఎంచుకునే మార్గమే
మనకి మిత్రులని లేదా శత్రువులని
ఏర్పరుస్తుంది

- రంజిత్

11/12/2022

ఎవరిని నొప్పించకుండా మంచి చెడులనేవి ఉండలేవు
కొందరికి మంచి ఇబ్బంది
కొందరికి చెడు ఇబ్బంది
కాబట్టి ప్రశాంతంగా మన పని మనం చేయడమే ఉత్తమ ధర్మం

11/12/2022

ఎక్కువతక్కువలు లేకుండా ప్రతీ మనిషిని సమానంగా చూడటమే
మనం మనకి ఇచ్చుకునే విలువ

11/12/2022

అలుకగా దొరికినవారిని
చులకనగా చూడటం
ప్రతి మనిషికీ పరిపాటే!!

07/12/2022

చింతలో లేని చిత్తంబు
చెంత చేరగనచినప్పుడు
చేజేతులు జాచి చేరదీయలేని
చుట్టంబులున్నా వారు చచ్చుబడిపోయి
చిత్తంబుపైనాశ చెంతజేరక
చివరాకరన కన్నీరు చెమ్మగిల్లేను
- రంజిత్ రెడ్డి

06/03/2022

అడుగు అడుగునా అండగా నిలిచినా బంధమా,
అనునిత్యం మాకై శ్రమియించే అనుభంధమా,
మనసు లోలోతున ఏ చిన్న కలత కలిగిన నీ దరి చేరి
ఆ చిరు దరహాసమున్న మోము చూచినంతనే స్వాంతన
చేకూర్చు నా హృదయమా,
నీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.(May 06)

06/03/2022

భాదలు అనంతం - ప్రశాంతమొక్కటే మన: చిత్తం,
గతంతో ప్రయాణం - వదిలొచ్చేసేయ్ నేస్తం,
సుఖదుఃఖాల సంగమం - ఇదే కదా జీవితం,
ప్రతీక్షణం అద్భుతం - ఆస్వాదించటం అవశ్యం.

Want your public figure to be the top-listed Public Figure in Pittsburgh?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Pittsburgh, PA