K. Manik Rao
MLA Zahirabad
01/05/2026
* *జహీరాబాద్ నియోజకవర్గం లోని పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు**
* ఈరోజు *పివిఆర్ ,ఎస్వీ ,రాజ్ మహల్ ఫంక్షన్ హాల్స్* ,& *జీర్లపల్లి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన, గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు* , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,కౌన్సిలర్ దీపక్, చిన్న రెడ్డి, ఫయాజ్ గ్రామాల సర్పంచ్ లు,మాజి ఎంపీటీసీ లు, గ్రామాల అధ్యక్షులు తదితరులు.....
01/05/2026
*అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు గారు*
ఈరోజు *గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు తన క్యాంపు కార్యాలయంలో* *జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందించడం జరిగింది* .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ *గ్రామ స్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బంది సేవలు మరింత సమర్థవంతంగా, వేగంగా ప్రజలకు చేరేందుకు ఈ డిజిటల్ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, గర్భిణీ స్త్రీల సంక్షేమం వంటి ముఖ్యమైన విషయాల్లో ఈ టెక్నాలజీ మంచి మార్పు తీసుకువస్తుంది.. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని సేవలను ఇంకా మెరుగుపరచాలి అన్నారు* .”
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,
వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ లు అబ్దుల్లా,గౌస్ గౌరీ ,జాకీర్,దీపక్,విశ్వేశ్వర్, ప్రవీణ్,నాయకులు అక్బర్ ,ఫయాజ్
&
Cdpo సుశీల,సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్ కుమార్,రాధమ్మ,సునీత బాయి,సద్గుణ, అనిత,నీరజ గ్రేస్, పవన్,శ్రీశైలం శ్రీనివాస్,
తదితరులు పాల్గొన్నారు.....
01/05/2026
*నూతన ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు* ...
ఈరోజు పట్టణంలో బై పాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన *వుడ్ రాక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు* , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,కౌన్సిలర్ లు ప్రేమలత,దీపక్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, చిన్న రెడ్డి, ఫయాజ్ తదితరులు....
01/05/2026
కార్మిక లోకానికి, శ్రమ జీవులకు మే డే శుభాకాంక్షలు
28/04/2026
*Press Release*
*సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు గారు,జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు గారు,సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారు పరామర్శ.*
*ఫేక్ పోస్టులు పెట్టిన వారిని వదిలేసి, ఆధారాలతో ఫిర్యాదు చేసిన క్రిశాంక్ ను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపే.*
*ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్ లతో అణచివేసే కుట్ర జరుగుతోంది.*
*కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు బెంగళూరు ప్రైవేట్ హ్యాకర్లను కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టి మా ఫోన్లు, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు.*
*చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్లను.. రేపు రిటైర్ అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు, విచారణ జరిపిస్తాం.*
*రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తుంటే రేవంత్ రెడ్డి వంద కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడంలో బిజీగా ఉన్నారు.*
*సన్నవడ్లకు బోనస్ ఇస్తారో లేదో సీఎం తేల్చాలి.. ఐదారు కిలోల తరుగు తీస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?*..............................................................
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌తో పాటు మరో ఏడుగురు పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు గారు,సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారు పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసుల తీరుపై మండిపడ్డారు.
*మాజీ మంత్రి హరీష్ రావు గారి కామెంట్స్....*
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, సిట్లు, కమిషన్లు వేస్తూ అణచివేసే కుట్ర చేస్తోంది.
రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పి నేడు నియంతలా వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్, బీఆర్ఎస్ నాయకత్వంపై ఫేక్ పోస్టులు పెడుతున్న వారి గురించి పోలీసులకు ఆధారాలతో సహా ఫోన్ అప్పగించి క్రిశాంక్ ఫిర్యాదు చేశారు.
కానీ తప్పు చేసిన వారిని వదిలేసి, కంప్లైంట్ ఇచ్చిన క్రిశాంక్ నే అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గం. దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైల్లో పెడతారా?
ముఖ్యమంత్రి, హోం మంత్రి రెండు బాధ్యతలూ మీరే పెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా రేవంత్ రెడ్డి.
ఇదేనా మీ ప్రజాస్వామ్యం? క్రిశాంక్ పై నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని సాక్షాత్తూ మెజిస్ట్రేట్ పోలీసులను ప్రశ్నించారంటేనే మీ కక్షసాధింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
అంగన్వాడీ ఫోన్ల కుంభకోణం, టెన్త్ పేపర్ లీక్, హెచ్‌సీయూ గచ్చిబౌలి భూములు, సోమ్ డిస్టిలరీస్ వ్యవహారం, మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ వివాదం.. ఇలా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకే ఆయనపై వరుసగా కేసులు పెట్టారు.
భారత పౌరులకు ప్రశ్నించే హక్కు లేదా?
లగచర్లలో గిరిజనుల పైనా, మెదక్, సంగారెడ్డిలో మా నాయకుల పైనా అక్రమ కేసులు బనాయించారు.
రేవంత్ రెడ్డి ఇలా కేసులు పెట్టి మళ్లీ గెలుస్తాననుకుంటే అది హిట్లర్ ను మించిన మూర్ఖత్వమే.
జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చుని నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటున్నావు. మీ అరాచకాలను గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టారు. ప్రతిరోజూ బీఆర్ఎస్ నేతల ఫోన్లను, మా ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను చట్టవ్యతిరేకంగా హ్యాక్ చేస్తున్నారు.
మా ఫోన్లు ట్యాప్ చేస్తున్న ఐపీఎస్ అధికారులకు ఇదే మా హెచ్చరిక. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.
మేము అధికారంలోకి వచ్చాక రిటైర్ అయినా సరే మిమ్మల్ని ఎక్కడున్నా వదిలిపెట్టం. కచ్చితంగా విచారణ జరిపిస్తాం.
చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న ఐపీఎస్ అధికారులకు తగిన మూల్యం తప్పదు.
అప్పుడు మిమ్మల్ని రేవంత్ రెడ్డి కూడా కాపాడలేడు. మీ సొంత డబ్బుతో అడ్వకేట్లను పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.
కాబట్టి చట్టానికి లోబడి పనిచేయండి.
క్రిశాంక్ ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి వికృత ఆనందం పొందుతున్నాడు.
మీ పార్టీ కార్యాలయంలో జరిగే అవినీతి, అక్రమాల వ్యవహారాలన్నీ రికార్డు అవుతున్నాయి. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ.
జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో వంద కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నావు.
నీ పాలనలో సగం కాలం పూర్తయింది, మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చెయ్.
రైతులు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తుంటే శనగలు, సన్ ఫ్లవర్ కొనే నాథుడే లేడు.
మీ మంత్రులు నిద్రపోతున్నారా? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది?
ఎకరాకు కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామని మక్కలకు కొత్త షరతులు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు.
13 లక్షల ఎకరాల్లో పంట వస్తే కనీసం సగం కూడా కొనలేని దుస్థితిలో మీరున్నారు.
వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. వడ్లకు ఐదారు కిలోల తరుగు తీస్తున్నారు. తరుగు పెడితే తోలు తీస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెవరి తోలు తీస్తాడో చెప్పాలి.
మిల్లుల ముందు లారీలు నాలుగైదు రోజులుగా ఆగిపోతున్నాయి.
యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇస్తావా? ఇవ్వవా? స్పష్టం చెయ్.
ఇవ్వలేకపోతే తప్పుకో లేదా జరిగింది చెప్పుకో అంతేకానీ ఏ సంగతీ చెప్పకుండా రైతులను మోసం చేయొద్దు.
ఎండలో రైతులు మాడిపోతుంటే పట్టించుకునే తెలివి లేదా? రైతుల కష్టాలు మీకు పట్టవా?
ఇప్పటికైనా అక్రమ కేసులు బంద్ చేసి, ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు గురించి ఆలోచించు. ప్రజలు మెచ్చే పాలన అందించు.
క్రిశాంక్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. మళ్లీ పీటీ వారెంట్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోం అని అన్నారు..
BRS Party KCR Kalvakuntla Taraka Rama Rao - KTR Harish Rao Thanneeru
27/04/2026
27/04/2026
*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*
ఆత్మగౌరవ పోరాట ఫలితంగా సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
అమరుల త్యాగాలతో, ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి అకుంఠిత దీక్షతో ఏర్పడిన మన తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
*భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*
27 ఏప్రిల్ 2001 నాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం, 'తెలంగాణ రాష్ట్ర సమితి' పేరుతో ప్రారంభమైన ఉద్యమ పార్టీ, నేడు 'భారత రాష్ట్ర సమితి'గా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
_పైన ఉన్న చిత్రం 27 ఏప్రిల్ 2001 న పార్టీ ఆవిర్భావం సందర్భంగా తీసిన చారిత్రాత్మక దృశ్యం._
ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి కార్యకర్తకు, నాయకునికి, తెలంగాణ ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
జై తెలంగాణ! జై భారత్!
---
మీ
*మాణిక్ రావు
జహీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు*
27/04/2026
*జహీరాబాద్ పట్టణంలో ఘనంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం*
ఈ రోజు *బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు, గౌరవ మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి & గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గార్ల ఆదేశాల మేరకు* .....
**జహీరాబాద్ పట్టణం ఐబీ గెస్ట్ హౌస్ వద్ద ఘనంగా మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,బీఆర్‌ఎస్ జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు గార్ల ఆధ్వర్యంలో గులాబీ జెండా ఎగరవేయడం జరిగింది* .
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ *ఉద్యమ గడ్డపై ఉదయించిన సూర్యుడిలా, తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించే ధ్రువతారగా బీఆర్‌ఎస్ నిలుస్తోంది. సంక్షేమమే ఊపిరిగా, అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు సాగుతూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీది* .
*దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం, “రైతే రాజు” అన్న నినాదంతో ముందుకు సాగుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు* 💐💐💐
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు *జహీరాబాద్ పట్టణ* మున్సిపల్ కౌన్సిలర్ లు యాకూబ్, అబ్దుల్లా, గౌస్ గౌరీ,మజ్జిగ విశ్వేశ్వర్,
ప్రవీణ్,జాకీర్,దీపక్,మహిపాల్,పాండు,నాయకులు పురుషోత్తం రెడ్డి,దత్తాత్రి, నసీర్, చౌహాన్ రవి కుమార్,అక్బర్, మహమ్మద్ అలీ,ముత్యాల శివ కుమార్ ,శివకుమార్ స్వామి, అఫ్సర్ మొహియుద్దీన్,
గణేష్ ,ఆర్ సుభాష్,చంద్రయ్య, ఇస్సాం, హశం,నరసింహ రెడ్డి, అలీం,
*జహీరాబాద్ మండలం* :- సర్పంచులు దాసరి మచ్చేందర్ ( హోతి బి)చల్లా శ్రీనివాస్ రెడ్డి (అల్గోల్),మోహన్ రాథోడ్( శేఖపుర్ తాండా), శ్రీనివాస్ (బుచినెల్లి) రాథోడ్ భీమ్ రావు నాయక్ ( హుగ్గెల్లి తాండా),హుగ్గెల్లి మాజి ఎంపీటీసీ రాములు, బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,నవీన్ తేజ ,గంట శ్రీనివాస్,విజయ్ రాథోడ్,ప్రసాద్ ,రాజు,నరేష్,నాగేష్,కమలాకర్,శ్రీనివాస్ ,రమేష్,తదితరులు
*ఝరాసంఘం మండలం* నాయకులు నరసింహ గౌడ్ ,వెంకట్ రెడ్డి,ch నాగన్న, సయ్యద్,శ్రీనివాస్ రెడ్డి,బాల్ రాజ్,నాగేందర్ ,శశి వర్ధన్ రెడ్డి,రాజు,తదితరులు
*మొగుడంపల్లి మండలం* సర్పంచ్ లు నాగిశెట్టి (ఇప్పెపల్లి),సుదర్శన్ రెడ్డి ( గుడుపల్లి),మాజి సర్పంచ్ సురేష్,ఈశ్వర్ రెడ్డి,నాయకులు నరసింహ రెడ్డి,చందర్ నాయక్, తదితరులు ....
*న్యాల్కల్ మండలం* సర్పంచ్ లు ప్రవీణ్ ( హద్నూర్),అశోక్ పాటిల్ (ఇబ్రహీం పూర్),మాజి సర్పంచ్ మారుతి, నాగేష్,మహేష్,రమేష్ , తదితరులు.....
*బిఆర్ఎస్వీ నాయకులు* ఓంకార్ మడవాళ్, ఫయాజ్, ఇక్బాల్, సుధీర్,ముబీన్ ,ఇంజిమాం,మోహన్, తదితరులు పాల్గొన్నారు.....
BRS Party KCR Kalvakuntla Taraka Rama Rao - KTR Harish Rao Thanneeru
26/04/2026
*వివాహ వేడుకలు & శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్*
ఈరోజు *జహీరాబాద్ పట్టణం, ఝరసంఘం ,న్యాల్కల్ మండలలో జరిగిన పలు వివాహ & శుభకార్యాల్లో* పాల్గొన్న *గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం* , *మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి* మచ్చేందర్ ,వివిధ గ్రామాల సర్పంచ్ లు , కౌన్సిలర్ లు , నాయకులు, కార్యకర్తలు తదితరులు.....
24/04/2026
*సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది* . *మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్‌పర్సన్‌తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఎన్నికకు గైర్హాజరు కావడంతో ఎన్నిక ప్రక్రియ రసాభాసగా మారింది* . *ఎన్నిక సమయానికి ఎమ్మెల్యే మాణిక్‌రావు గారు తన అనుచర వర్గంతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు* . *అయితే కాంగ్రెస్ సభ్యులెవరూ రాకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు* . *ఓటమి భయం పట్టుకోవడంతోనే కాంగ్రెస్ కౌన్సిలర్లు వెనకడుగు వేశారని ఆయన మండిపడ్డారు* . *అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నికను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు* . అధికారుల తీరుపై మండిపడుతూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.
BRS Party KCR Kalvakuntla Taraka Rama Rao - KTR Harish Rao Thanneeru
23/04/2026
*జహీరాబాద్ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు గారు* .
ఈ సందర్బంగా మాట్లాడుతూ..
- రెండు సంవత్సరాలు అయ్యింది ప్రభుత్వం వచ్చి... కార్మికులు రెండున్నర ఏళ్లుగా ఓపిక పట్టి ఈరోజు సమ్మెకు దిగాల్సి వచ్చింది...
- ప్రభుత్వంలో ఉన్న పొన్నం ప్రభాకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
- ఆర్టీసీ కార్మికుల వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారు.
- RTC ప్రైవేట్ ఐపోయే పరిస్థితి వచ్చింది.
- హైదరాబాద్ లో RTC ప్రైవేట్ చేస్తారట, మహాలక్ష్మి వచ్చిన తర్వాత డ్రైవర్, కండక్టర్ల మీద ఒత్తిడి పెరిగింది.
- కాంగ్రెస్ ప్రభుత్వం RTC కార్మికుల ఉసురుపోసుకుంటుంది.
- గతంలో RTC కి 200 కోట్ల చెక్కు ఇస్తే దానికి దిక్కు లేదు... రేవంత్ ఇచ్చిన చెక్ ఇప్పటికి చెల్లలేదు..
- మేం గతంలో ఇచ్చిన బస్సులే జెండా ఊపి ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- సర్వీస్ అయిపోయిన బస్సులు తీసివేసి కొత్త బస్సులు తేవాలి
- ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటే మీరు ఎందుకు సమ్మె చేస్తారు ? ఇప్పుడే గుర్తిస్తాం అంటే విరమిస్తారు కదా!
- *ఆర్టీసీ సమ్మెకు BRS పార్టీ మద్దతుగా ఉంటుంది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం*
- కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులగా వద్దు కానీ ఆర్టీసీ ఆస్తులు RTC భవన్ ప్రభుత్వము తీసుకుంటారట
- కొత్త డ్రైవర్ ను తీసుకోకపోవడం వల్ల పాత డ్రైవర్ల మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది.
- సమ్మె ఉండటం వల్ల కాంట్రాక్టర్ డ్రైవర్ల ను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు అని అన్నారు .
- ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, కొహిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మున్సిపల్ కౌన్సిలర్ లు గౌస్ గౌరీ,దీపక్, విశ్వేశ్వర్,ప్రవీణ్,సర్పంచ్ లు మచ్చేందర్, మోహన్ రాథోడ్,రాథోడ్ భీమ్ రావు నాయక్,బాల్ రాజ్ ,దేశెట్టి పాటిల్, తదితరులు పాల్గొన్నారు......
Click here to claim your Sponsored Listing.