Doddareddy Sidda Reddy
Rayalaseema Senior Politician,
Tirupati.
06/06/2026
దొడ్డారెడ్డి సిద్దారెడ్డి గారు, దేవదానం గారు రాహుల్ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించిన శ్రీ జిల్లా సుబ్బారాజు గారు – శ్రీమతి జిల్లా గీతా లక్ష్మి గారి 50వ వివాహ వార్షికోత్సవ (స్వర్ణ వివాహ మహోత్సవ) వేడుకలకు హాజరై దంపతులను సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు శుభాభినందనలు తెలియజేశారు.
05/06/2026
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జూట్, క్లాత్ బ్యాగులను ఉపయోగించాలి. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, పెంచి సంరక్షించే బాధ్యత తీసుకోవాలి.
మన చిన్న ప్రయత్నాలే రేపటి తరాలకు పచ్చని భవిష్యత్తును అందిస్తాయి. “ఒక మొక్క – ఒక బాధ్యత… ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్పి, ప్రకృతికి తోడుగా నిలుద్దాం!”
05/06/2026
వాసు గారి తల్లి శ్రీమతి పార్వతమ్మ గారి మరణవార్త తెలుసుకుని, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి గారు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
28/05/2026
పరస్పర ప్రేమ, త్యాగం, సేవా భావానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంట ఆనందాలు నింపాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
28/05/2026
ఒక వ్యక్తిగా కాదు.. ఒక శక్తిగా, ఒక నాయకుడిగా కాదు.. ఒక యుగంగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహానేత నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా వినమ్ర నివాళులు.
సోమలలో యువనేత పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి పట్టణ 10వ వార్డు ఇండిపెండెంట్ కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, వారి మిత్రులు.. తదితరులు..
22/05/2026
యువనేత పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన Doddareddy Prathap Reddy గారు
22/05/2026
సోమలలో యువనేత పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి పట్టణ 10వ వార్డు ఇండిపెండెంట్ కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, వారి మిత్రులు.. తదితరులు..
20/05/2026
తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల ప్రేమను సంపాదించుకుని, తన తాతగారి వారసత్వానికి తగ్గ మనవడిగా నిలిచిన మా జూనియర్ ఎన్టీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆనందంతో, మరెన్నో విజయాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Heartfelt birthday wishes to our Jr. NTR, who has won millions of hearts across the globe with his phenomenal acting and charismatic screen presence, truly carrying forward the glorious legacy of his grandfather. Wishing you great health, happiness, and many more blockbuster successes ahead.
12/05/2026
తాతయ్యగుంట గంగమ్మ ఆలయం సమీపంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన గంగమ్మ జాతర అన్నదాన కార్యక్రమంలో దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి గారు, మబ్బు సూర్యనారాయణ రెడ్డి (Bliss) గారు, ధుగ్గన పురుషోత్తం రెడ్డి గారు, రాజా రెడ్డి గారు, మునీశ్వరులు రెడ్డి గారు, పులిగోరు ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీనివాసులు రాజు (TMR) గారు పాల్గొని భక్తిశ్రద్ధలతో అన్నదాన సేవ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేస్తూ గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో జాతర ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
517501