Chevireddy Mohith Reddy

Chevireddy Mohith Reddy

Share

In-Charge of Chandragiri Constituency, YSR Congress Party | State Youth Wing General Secretary, YSR Congress Party | Former TUDA Chairman

21/06/2026

🚨 అవిలాలలో రిటైర్డ్ ఆర్టీఓ భూమి మాయం..!

❓ కూటమి ప్రభుత్వం వచ్చాకే రికార్డులు ఎందుకు మారాయి..?

❓ 2023 వరకు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న 3.17 ఎకరాల భూమి ఒక్కసారిగా ఎలా అదృశ్యమైంది..?

❓ అధికారిక పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు బాధితుల వద్ద ఉండగానే భూమి మరొకరి చేతికి ఎలా వెళ్లింది..?

🔹రిటైర్డ్ ఆర్టీఓ ద్వారక నాథ రెడ్డికి చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిని ఎమ్మెల్యే నాని, మంత్రి అనగాని అధికారుల సహకారంతో కాజేశారని ఆయన భార్య వనజాక్షమ్మ సంచలన ఆరోపణలు చేశారు.

🔹"2023 వరకు తన పేరుతో ఉన్న భూమి రికార్డులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమై ఎమ్మెల్యే, మంత్రి బినామీల పేరిటి మారాయి.

🔹ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించారు" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారం వెనుక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మంత్రి అనగాని సత్యప్రసాద్ అండతోనే దోచేశారు అని బాధితురాలు ఆరోపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

👉 అయితే తన భూమి రికార్డులు మార్చింది ఎవరు..?

👉 భూమిని కాపాడాల్సిన వారే కబ్జా చేస్తే ఎవ్వరికి చెప్పుకోవాలి ?

👉 కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టా భూములకు భద్రత లేకుండా పోతోంది.

20/06/2026

🚨 "మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు... నిన్న చెప్పు చేత బట్టుకుని నిరసన... నేడు సెల్ఫీ వీడియో... ఎమ్మెల్యే పులివర్తి నానిపై చంద్రగిరి జనసైనికుల ఆగ్రహం" 🚨

🔥 మాకష్టంతో గెలిచి... మమ్మల్నే అవమానిస్తారా ..?

🔥 జనసేన ఓట్లు కావాలి... జనసైనికులు వద్దా..?

🔥 ఎన్నికల్లో భుజాలపై మోసిన జనసైనికులను... అధికారంలోకి వచ్చాక గేటు బయట నిలబెడుతారా..?

🔥 మిత్రపక్ష నాయకులు, కార్యకర్తలను అవమానించడం మీ రాజకీయ అహంకారానికి నిదర్శనం కాదా..?

👉 ప్రభుత్వ కార్యాలయాల్లో జనసేన నాయకులకు పనులు జరగకుండా అడ్డంకులు పెడతారా..?

👉 ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేనకు గుర్తింపు లేకుండా చేయడం...కనీస సమాచారం ఇవ్వకపోవడం..

👉 ప్రభుత్వ కార్యక్రమాల వేదికలపై స్థానం లేకుండా అవమానాలు...

👉 అన్నీ కాదనుకుని సమావేశాలకు వచ్చినా బయటే ఉండాలన్న షరతులు

👉 మీ గెలుపులో భాగస్వాములైన జనసైనికులకు ఇదేనా మీరు ఇచ్చే ప్రతిఫలం..?

❓ పులివర్తి నాని గారూ... జనసేనను ఎన్నికల వరకు మాత్రమే వాడుకుని ఆ తరువాత వదిలేసినట్టున్నారు.

⚠️ జనసైనికుల సహనాన్ని బలహీనతగా భావించొద్దు...

⚠️ అవమానాలు పెరిగితే ఆవేదన.. ఆపై ఉద్యమంగా మారుతుంది...

*అందుకు నిదర్శనమే...*

⚡ మొన్న – పులివర్తి నాని అవినీతి, అక్రమాలపై జనసేన ఇన్‌చార్జ్ దేవర మనోహర్ అధినేత పవన్ కు ఫిర్యాదు

⚡ నిన్న – చంద్రగిరి మండల జనసేన అధ్యక్షుడు మురళిరెడ్డి తొండవాడలో చెప్పు చేతిలో పట్టుకుని బహిరంగ ఆగ్రహం

⚡ నేడు – మంగళం జనసేన నాయకుడు సాయి సెల్ఫీ వీడియోతో ఆవేదన

ఇవన్నీ మీ రాజకీయ అహంకారానికి నిదర్శనం కాదంటారా..? సమాధానం చెప్పండి నానీ గారు..?

19/06/2026
18/06/2026

అందరికీ మంచి చేసిన మాపై ఆరోపణలా..?
మీ ఆరోపణలుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది.

తుడా నిధులతో ఏర్పాటు చేయించిన సిమెంటు బెంచీలపై ఆరోపణలు చేస్తున్నారు. మేం ఏ బెంచీలైతే వేశామో.. అదే బెంచీ 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో రూ.14,400లకు టెండర్లు పిలిచి వందల బెంచీలు ఏర్పాటు చేయించారు. ఆ తరువాత నాలుగేళ్లకు తుడా నుంచి అదే రకమైన బెంచీని రూ.8,500లకు కొనుగోలు చేస్తే ఎవ్వరు ఎక్కువ ధరకు కొన్నారు..? ఏ వస్తువు అయినా ఏళ్లు గడిచే కొద్దీ ధరలు పెరుగుతాయే కానీ తగ్గేది వుండదు కాదా..? దీనిని బట్టి చూస్తే ఏ ప్రభుత్వంలో అవినీతి జరిగింది ? ఎవ్వరు అధిక ధరలను కోట్ చేసి దోచుకున్నారో అర్థమవుతుంది.. ఇలాంటి తప్పుడు లెక్కలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని భగవంతుడు, ప్రజలు క్షమించరు.

18/06/2026

- బాధితునితో బలవంతంగా మాట్లాడిస్తే.. నిజం.. అబద్ధమవుతుందా..?
- ఒక ఎమ్మెల్యేగా బాధితునికి బాసటగా నిలవాలే కానీ.. ఇలా భయపెడతారా..?
- మీరు రాసిచ్చిన స్క్రిప్ట్‌ జవాను బాగానే చదివినా.. మొదట తాను వీడియోలో చెప్పిందంతా నిజమనే చెప్పారు కదా..? ఆ విషయం మరచిపోయారా..?

పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ సూరినేనివారిపల్లికి చెందిన బీ.ఎస్‌.ఎఫ్‌ జవాను అరగొండ గంగాధరం తన గ్రామంలో ఇళ్లు కట్టుకోవడానికి టీడీపీ నాయకుడు కొంగర బాలాజీ రూ.2 లక్షలు లంచం అడిగినట్టు కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

ఆ వీడియోలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడైన స్థానిక టీడీపీ నేత కొంగర బాలాజీ బీఎస్‌ఎఫ్‌ జవాను ఇళ్లు కట్టుకోనీయకుండా అడ్డుకోవడం, రూ. 2లక్షలు డబ్బులు డిమాండ్‌ చేయడం, అధికారులంతా కూడా ఆ టీడీపీ నాయకుడు చెప్పినట్టు వినాలని జవానుకు చెప్పడం వంటి వాస్తవాలు బయటకు వచ్చాయి.

అదే వీడియోను ‘విష ప్రచారం’ అని టైటిల్‌ పెట్టి బాధిత జవాను ద్వారా బలంవంతంగా తప్పని చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే నిజమైన బాధితుడు గంగాధరం అందులో కూడా ‘కొన్ని రోజుల క్రితం తాను రిలీజ్‌ చేసిన వీడియోలో వున్నదంతా వాస్తవం’ అనే చెప్పారు. ఆ తరువాత మీరు రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివించినా.. ఆ వీడియో ఆరంభంలో మాత్రం తాను చెప్పిందంతా నిజమనే విషయాన్ని అంగీకరించారు..

ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా వున్న మీరు బాధితులకు న్యాయం చేయాలే కానీ.. ఇలా భయపెట్టి వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో ప్రశ్నించిన వారిపై విషప్రచారమని ఎదురు దాడి చేయడం చేతకాని తనమే అవుతుంది.

15/06/2026

- సైనికున్నీ వదలరా.. తమ్ముళ్లూ..?
- మీ అవినీతి దాహానికి ఎవ్వరైనా బలవ్వాల్సిందేనా ?
- ఆ జవాను ఆవేదనకు కారకులు మీరు కాదా ?
- మీ అవినీతికి అధికారులను అండగా పెట్టుకుంటారా ?
- బాబు గారు మీరు చెబుతున్న మంచి ప్రభుత్వం ఇదేనా..?

ఇప్పటి వరకు మట్టి మాఫియా.. ఇసుక మాఫియా.. భూ ఆక్రమణలు.. దౌర్జన్యాలు.. దాడులు.. వంటి అరాచక పాలనను చూసిన చంద్రగిరి ప్రజలు విసిగిపోయారు.. అదంతా ఒక ఎత్తు అయితే దేశ సరిహద్దులో కాపలా కాస్తున్న ఓ సైనికునికి ఇళ్లు కట్టనీయకుండా చుక్కలు చూపిస్తున్నారు స్థానిక టీడీపీ యువ నాయకుడు కొంగర బాలాజీ. తన అవినీతి దాహానికి ఓ సైనికుడు తీవ్ర ఆవేదనతో విడుదల చేసిన సెల్ఫీ వీడియో అందుకు సాక్ష్యం. ఆ నాయకుని అవినీతికి రెవెన్యూ అధికారులు తోడుగా నిలబడటంతో ఆ జవాను ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక.. అడిగినంత డబ్బులు ఇవ్వలేక ఇలా సోషల్ మీడియా వేదికగా విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి తెలిసేలా చేశారు.. దీనిని మంచి ప్రభుత్వమని అంటారా..? ఇలాంటి నాయకుల వల్ల జవానుకే కష్టం వస్తే.. సామాన్యుల పరిస్థితి ఏమిటి ? ఒక్కసారి ఆలోచించండి..

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం సూరినేనివారిపల్లికి చెందిన బీఎస్ఎఫ్ జవానుకు జరిగిన అన్యాయంకు ఈ ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది..? అందుకు కారకులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ? బహిరంగంగా చెప్పాలి.

13/06/2026

ప్రజలకు ఏమి ఇచ్చారు, ఏమి విజయాలు సాధించారని మీరు సంబరాలు చేసుకుంటున్నారు చంద్రబాబు గారు?నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చావా, మహిళలకు ఆడబిడ్డ నిధి ఇచ్చారా..? ఏ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేశారని ఇప్పుడు సంబరాలు చేస్తున్నారు? కబ్జాలు, మోసాలు, దాడులు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా చంద్రగిరి నియోజకవర్గాన్ని మార్చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రతి కార్యకర్త పోరాడాలి. ప్రజలకు వెన్నుపోటు పొడిచే దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపి, జగనన్నకు పట్టాభిషేకం చేసే వరకు ఇలాగే పోరాడుతాం.

*thReddy

Photos from Chevireddy Mohith Reddy's post 12/06/2026

చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ర్యాలీ. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద భారీగా చేరుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు. నిరసన ర్యాలీకి హాజరైన చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రాష్ట్ర వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీ పత్రాలను తగలబెట్టిన వైఎస్సార్‌సీపీ నాయకులు. 'చెట్టుమీద కొంగ. చంద్రబాబు దొంగ‌‌.. వెన్నుపోటు ప్రభుత్వం.. మాకొద్దు‌.. సూపర్ సిక్స్.. సూపర్ మోసం.. అబద్దాల బాబు.. మాకొద్దు..' అంటూ నినాదాలతో హోరెత్తించిన పార్టీ నేతలు, కార్యకర్తలు. అనంతరం ప్రభుత్వం చేతకాని తనం, మోస పూరిత హామీలను ఎండగడుతూ భారీ ర్యాలీ.

*thReddy

11/06/2026

వెన్నుపోటుకు రెండేళ్లు.. చంద్రగిరిలో భారీ నిరసన.

ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, మోసపూరిత పాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి ధర్మరాజుల ఆలయం వద్ద నుంచి నిర్వహించే భారీ నిరసన ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయాలి.

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

📅 తేదీ: 12-06-2026 (శుక్రవారం).
🕤 సమయం: ఉదయం 10 గంటలకు.
📍 స్థలం: చంద్రగిరి, టవర్ క్లాక్.

Photos from Chevireddy Mohith Reddy's post 10/06/2026

చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెంకు చెందిన కె.కృష్ణమూర్తి రాష్ట్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి తన అనుచరులతో కలిసి వెళ్లిన కృష్ణమూర్తి ఆయనను గజ మాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి పార్టీలో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతకు కష్డపడాలని సూచించారు.

Want your public figure to be the top-listed Public Figure in Tirupati?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Tummalagunta
Tirupati
517502