Pilgrimage India

Pilgrimage India

Share

India has rich cultural and historical heritage well preserved in its temple architecture and pilgrim sites.

Photos 20/08/2016

--: శ్రీవేంకటేశ్వర కరావలంబ స్తోత్రం :--
=======================
శ్రీ శేషశైల సునికేతన దివ్య మూర్తే
నారాయణాచ్యుతహరే నళినాయతాక్ష!
లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

బ్రహ్మాది వందిత పదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త!
కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే

శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
వేదాంతవేద్య భవసాగర కర్ణధార
శ్రీ పద్మనాభ కమలార్చిత పాదపద్మ!
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప
కామాదిదోష పరిహారితబోధదాయిన!
దైత్యాదిమర్దన జనార్ధన వాసుదేవ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

తాపత్రయం హరవిభో రభసాన్మురారే
సంరక్షమాం కరుణయా సరసీరుహాక్ష!
మచ్చిష్య ఇత్యనుదినమ్ పరిరక్ష విష్ణో
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట
కస్తూరికా తిలక శోభిలలాటదేశ!
రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

వందారులోక వరదాన వచోవిలాస
రత్నాడ్యహార పరిశోభిత కంబుకంఠ!
కేయూరరత్న సువిభాసి దిగంతరాళ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్
కేయూర భూషణ సుశోభిత దీర్ఘబాహొ!
నాగేంద్ర కంకణ కరద్వయ కామదాయిన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

స్వామిన్! జగద్దరణ వారధి మధ్యమగ్నం
మాముద్దరాధ్య కృపయా కరుణాపయోధే!
లక్ష్మీంచ దేహి విపులామృణవారణాయ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ
పీతాంబరావృతతనో తరుణార్క దీప్తే!
సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

రత్నాడ్యధామ సునిబద్ద కటిప్రదేశ
మాణిక్యదర్పణ సుసన్నిభ జానుదేశ!
జంఘాధ్వయేన పరిమోహిత సర్వలోక
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

లోకైక పావన లసత్పరిశోభితాంఘ్రి
త్వత్వాద దర్శన దినేశ మహాప్రసాదాత!
హార్ధం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

కామాది వైరినివహో ప్రియ మాం ప్రయాతః
దారిద్య్రమప్యగతం సకలం దయాళో!
దీనంచ మాం సమవలోక్య దయార్ద్రదృష్యాం
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!

శ్రీ వేంకటేశ పాదపంకజషట్పదేస
శ్రీమన్ నృసింహ యతినా రచితం జగత్యామ !
ఏతత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమం పదవీం మురారేః !!

23/03/2015

Antravedi LakshmiNarasimha Swami Temple Andhra Pradesh

http://pilgrimagetoindiatours.blogspot.in/2012/01/antravedi-lakshminarasimha-swami-temple.html

24/02/2015

Pilgrimage India India has rich cultural and historical heritage well preserved in its temple architecture and pilgrim sites.

Photos 29/10/2013

శివాభిషేక ఫలములు

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

Photos 29/10/2013

శ్రీరామ రామ రామేతి ,
రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం,
రామ నామ వరాననే.

Photos 29/10/2013

దీపావళి రోజున లక్ష్మీపూజ

"దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్|
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే||"

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అలాంటి దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత కలదు. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు.

ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో.. తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా.. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.

ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. నీవు అనుకున్నట్లు శ్రీహరి అంత సంకుచిత మనస్కుడు మాత్రం కాదు.

"నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

Photos 03/09/2013

గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"

"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించృ పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కదైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు సూతుడు.

మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. తద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించండి.

ఓం గం గణపతయే నమః

Photos 03/09/2013

ఆళ్వారుల వైభవము-2

పన్నిద్దరాళ్వారుల నామధేయములు మరియు వారి విష్ణుమూర్తి యొక్క అంశ

1.పొయిగై ఆళ్వారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాంచజన్యము అంశమున జన్మించినవారు.పాంచజన్యము విశ్వము లోని శబ్దమునకు మరియు సారస్వతమునకు సాంకేతికము.

2.భుతాళ్వారు లేక పూదత్తళ్వారు. కౌమోదకి అను స్వామి గద యొక్క అంశము. గద యుద్దమునకు సాంకేతికము. విశ్వమునండు నిరంతరము రెందు శక్తుల మద్య పోరాటము జరుగుచునే ఉన్నది. యిందు భౌతిక శక్తులకంటే నైతిక శక్తులకు ప్రాధాన్యము మెండు.. అనగా మంచి చెడుల మద్య పొరాటముగను, మంచి చెడును వోడించు గాక అను భావము యిమిడి వున్నది.

3.పేయాళ్వారు. విష్ణుమూర్తి యొక్క నందకము అను ఖడ్గము అంశము.
మానవుడు దుర్మార్గమును తన నైతిక ఖడ్గముతో చేదించుటకు అను భావము యిమిడి ఉన్నది.

4.తిరుమళిశై ఆళ్వారు. విష్ణుమూర్తి యొక్క సుదర్శనచక్రము అంశము. సుదర్సనచక్రము కాలమునకు సంకేతికము. విశ్వము అనంతము మరియు కాలము ఆదిమద్యాంత రహితము అనుభావములు రెండును యిందు యిమిడివున్నవి.

5.కులశేఖరాళ్వారు. విష్ణుమూర్తి యొక్క కౌస్తుభమణి అంశము. విశ్వములోని విలువలకు సంపదలకు కౌస్తుభము సాంకేతికము.

6.తొండరడిప్పొడి ఆళ్వారు (విప్రనారాయణుడు).విష్ణుమూర్తి ధరించునట్టియు, వాడిపోనట్టియు అగు వైజయంతి అను పుష్పమాల అంశము. విశ్వమునందలి కల అనేక రమ్యమైన వ్రుక్ష ప్రక్రుతి సంపదలకు సాంకేతికము.

7. తిరుప్పణి ఆళ్వారు. విష్ణుమూర్తి యొక్క శ్రీ వత్సలాంచనము అంశము. మహాసముద్రమునకు, దయాసముద్రమునకు సాంకేతికము. దయాగుణమె విశ్వమునకు, ప్రక్రుతికి, సంఘమునకు, వ్యక్తికి జీవము.

8.తిరుమంగై ఆళ్వారు. విష్ణుమూర్తి యొక్క శార్జ్గము అను ధనుస్సు అంశము. ప్రపంచమున దుష్టశిక్షనకు ధనుస్సు అవసరము.

9.పెరియాళ్వారు (విష్ణుచిత్తుడు). విష్ణుమూర్తి యొక్క రథము అంశము. స్వామిరథము గంభీరతకును, దర్పముకును, ఆనందమునకును ప్రొత్సాహమునకును సాంకేతికము. రథొత్సవము ఎంత గంభీరముగ నుండునో, మానవుడు తన గుణాలంకరణచే గంభీరుడై, ఉన్నతుదై, తోటివారికి అండగా, దండనగా, ప్రోత్సాహిగా మెలగవలయునని భావము.

10.ఆండాళ్ (గోదా దేవి). భూదేవి అవతారము. భూదేవి పంచభూతములలొ నొకరు.

11.నమ్మళ్వారు. విష్ణుమూర్తి సేనాని విష్వక్సేనుని అంశము. నాయకునికి సాంకేతికము. విష్ణుమూర్తి స్థితి పోషకుడు గావున అట్టి స్థితిపోషణకు నాయకత్వమను విశిష్ట గుణము అవసరము.

12.మధురకవి ఆళ్వారు. గరుత్మంతుని అంశము. శక్తికి గమనమునకు మరియు వేగమునకు సాంకేతికము.

యీవిధముగా పన్నిద్దరాళ్వార్ల అంశములు చేరి విశ్వమే అగుచున్నది. అందువలన వారిని విష్ణ్వాంశములని ప్రబంధములలొ వర్ణించియున్నారు.

\_I_/ శ్రీమతే రామానుజాయనమ:_/\_

Photos 03/09/2013

September 3, 2013 - Tuesday
శ్రీ విజయనామ సంవత్సరం, దక్షిణాయనం,వర్ష ఋతువు
Week వారము : Tuesday, Month : శ్రావణ, Paksha : బహుళపక్షం
Tithi తిథి : త్రయోదశీ 03:14 PM
Sunrise సూర్యోదయం : 06:02 AM, Sunset సూర్యాస్తమయం : 06:21 PM
Moonrise చంద్రోదయం : 03:59 AM
Star నక్షత్రం : ఆశ్లేషా 04:47 AM (next day)
Yogam యోగం : పరిధ 09:12 PM
Solar Zodiac సూర్యరాశి : సింహ, Lunar Zodiac చంద్రరాశి : కర్క
Rahukalam రాహుకాలం : 03:14 PM to 04:49 PM
Yamagandam యమగండం : 09:05 AM to 10:36 AM
Durmuhurtham దుర్ముహూర్తం : 11:03 PM to 11:49 PM
Varjyam వర్జ్యం : 04:37 PM to 06:22 PM
Amritakalamu అమృతకాలం : 03:06 AM (next day) to 04:50 AM (next day)

31/08/2013

తిరుమల గురించి కొన్ని నిజాలు

1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.

3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు.స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.

4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.

5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.

6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.

7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.

9. చనిపోయినప్పుడు వెనక్కి చూచూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.

10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.

11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.

Want your business to be the top-listed Travel Agency in Secunderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address

Secunderabad