Jakkula Rajendhar
📞 8688642861& 9848818313
Leader Of Janasena Party TS (UKNR)
Ex Excutive Member Youth Wing
31/12/2025
Wishing everyone
HAPPY New year 2026
I really Hope, this year will bring joy and happiness.
and all the good things in your lives.
Have a great start to everyone 💐💐🎁🎁
20/05/2025
SSC BATCH 2002-03 MALLAPUR ZPHS
10TH CLASS OLD MEMORIES
13/05/2025
26/04/2025
గౌరవనీయులు, పెద్దలు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేత,BRS అధ్యక్షుడు శ్రీ KCR గారి ఆధ్వర్యంలో ఉద్యమ పార్టీగా మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి,
2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. సుదర్శన్ రావు, నాయిని నర్సింహారెడ్డి, హన్మంతరావు, గాదె ఇన్నయ్య, వి. ప్రకాశ్, నిమ్మ నర్సిం హారెడ్డి, నారాయణరెడ్డి, గొట్టె భూపతి, మందాడి సత్యనారాయణరెడ్డి, హరీశ్ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు ఏడాదికిపైగా జలదృశ్యంలోనే టీఆర్ ఎస్ పార్టీ కార్యకలాపాలు సాగాయి. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో పార్టీ ముఖ్యపాత్ర పోషించింది.
అక్కడ నుంచి మొదలైన తెరాస ప్రస్తానం అనేక ఒడిదుడుకులు, అవమానాలు,విజయాలు, అపజయాలు,
అన్నింటినీ తట్టుకుని మలి దశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో,తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీ KCR గారి పాత్ర తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువలేనిది.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి, కొత్త రాష్ట్ర పాలన పగ్గాలు శ్రీ KCR గారు చేపట్టారు.2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఆయన రెండవసారి కూడ రాష్ట్ర ప్రభుత్వం పాలనను కొనసాగించారు.
అలా దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణాను ఏలిన Kcr గారు తెరాస పార్టీ. మధ్యలో పార్టీ పేరు మార్పు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర దిశగా అడుగులు వేసి 2023 ఎన్నికల్లో 39 సీట్లతో ప్రతిపక్షంలో వచ్చారు.
అయితే ఒక ఉద్యమ పార్టీగా మొదలైన తెరాస ప్రస్తానం,
ఫక్తు రాజకీయ పార్టీగా మారి, 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా BRS నాయకులు కార్యకర్తలకు BRS రజతోత్సవ శుభాకాంక్షలు.
ఒక రాజకీయ పార్టీ నడపడం మామూలు విషయం కాదు. చరిత్రలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ కొన్ని మాత్రమే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమాజంలో నిత్యం జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నడుస్తున్నాయి. తెలంగాణ చరిత్రలో తెరాస పార్టీకి, శ్రీ KCR గారికి ప్రత్యేక పేజీలు ఉంటాయి.
ఇలాంటి 25 వసంతాల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేల మరొక్కసారి మన రాజకీయ అవగాహన వేదిక నుండి Brs నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ హార్దిక శుభాకాంక్షలు....
ఇట్లు.
రాజకీయ అవగాహన వేదిక..
Whatsup Group
https://chat.whatsapp.com/E8HzU9NCutt0WusjWuTIHW
సమకాలీన రాజకీయాల్లో జరుగుతున్న వాస్తవ పరిణామాలు రాజకీయ పార్టీల ధోరణుల మీద నా వ్యక్తిగత అభిప్రాయం
మన దేశంలో కేవలం బీజేపీ చేసేది మాత్రమే మత రాజకీయం అంటారు. కానీ, అదే పని దశాబ్దాలుగా కాంగ్రెస్ చేస్తూ వచ్చింది అయిన దానిని మతతత్వ పార్టీ అనరు. సెక్యులర్ పార్టీ అంటారు.(సెక్యులర్ అని వాళ్లకు వాళ్ళే సృష్టించి జనాలలోకి వదిలినారు) సెక్యులర్ అంటే అర్ధం ఏమిటి? కేవలం ముస్లిం సమాజానికి చెడు జరిగినప్పుడు మాత్రమే బయటకు వచ్చి వాళ్లకు మద్దతు ఇవ్వాలి?!. అదే సమయంలో అలాంటి ఏదైనా ఆపద హిందువులకు వస్తె దగ్గరికి కూడా రారు. వస్తె ముస్లింల ఓట్లు రావు అని భయం ఇంకెంత కాలం ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు చేస్తారు. సెక్యులర్ అంటే సమానత్వం కాదా? అందరినీ ఒకే దృష్టితో చూడడం కాదన్నమాట!? కాంగ్రెస్ పార్టీ దృష్టిలో సెక్యులర్ అంటే ముస్లింలకు మాత్రమే ఆపద వస్తే మద్దతు ఇవ్వాలి. కానీ వారిది మతతత్వ పార్టీ కాదు సెక్యులర్ పార్టీ అని భజన చేస్తారు. అదే బీజేపీ అందరినీ సమానంగా చూస్తున్న కూడా బీజేపీనీ మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఇదెక్కడి న్యాయం? సెక్యులర్ అంటే ఒక్క సైడ్ మాత్రమే కాదు, రెండు వైపుల చూడాలి. ముస్లింల ఓట్లు వద్దు వారికి అన్యాయం చేయమని ఏ హిందువు కూడా చెప్పడు. నిజానికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అక్కడ అన్ని వర్గాల అన్ని మతాల ఓట్లు పడతాయి శాతంలో తేడా ఉండొచ్చు. మన ఎన్నికల వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పడడంలో సీట్లు ముఖ్యం కాబట్టి వాటి కోసం ఇదంతా తాపత్రయం. 100% ముస్లిం సమాజం యొక ఇంపాక్ట్ మన ఎన్నికల్లో ఉంది. అలా అని హిందువులు కాంగ్రెస్ పార్టీలో లేరా అంటే? ఉన్నారు. కానీ వారి వారి పదవుల పందేరంలో టికెట్ల వేటలో ఇలాంటి రాజకీయం చేస్తూ వస్తూనే ఉన్నారు. సరే! అసలు ఇక బీజేపీ లాంటి ఒక పార్టీ ఈ సైడ్ తీసుకోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాదా?! నిజానికీ సెక్యులర్ సెక్యులర్ అని చెప్పుకు తిరిగే కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూసే రాజకీయం చేసి ఉంటే ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు గొడవలు అల్లర్లు (బెంగాల్ ఘటన)జరిగేవా?! అసలు బీజేపీ లాంటి ఒక పార్టీ వచ్చేదా? ఈ రోజు దేశంలో బిజెపి ఇంత బలంగా వుండడానికి అసలు సిసలు కారణం కాంగ్రెస్సే అన్నది. గ్రామీణ ప్రాంతంలో ఉండే జనాలకు కూడా అర్థం అయింది. అయినా కాంగ్రెస్ పార్టీ దోరణిలో ఏ మాత్రం మార్పు లేదు. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దీనంగా మారుతుంది.
Jakkula Rajendhar.
JanaSena Party
23/04/2025
10/04/2025
ఈవిడ గారి ప్రయాస ఏంటి అనుకున్నారా? తెలంగాణలో ఈవిడ గారిని జనం మరిచిపోయారు. స్వయంగా వారి పార్టీ కార్యకర్తలే గుర్తించట్లేదు. ఇప్పుడు ఎవరిని గెలికితే పొలిటికల్ Existence లో ఉంటారో తెలిసి ఇలాంటి కామెంట్స్ చేశారు.
మీరు సీరియస్ పొలిటీషియన్ కాబట్టే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయావు. Mlc ఎన్నికలను ఎలా convenient గా మార్చి నిన్ను గెలిపించినారో కూడా అందరికీ తెలుసు.
ఎవరూ సీరియస్ పొలిటీషియన్ ఎవరూ కాదు అనేది 2019 లో జనాలు మీకు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మీరేం చేశారు కూడా తెలుసు.
వున్న కాస్త గౌరవం కూడా పోగొట్టుకునే పనులు ఎందుకు అక్క!?
మళ్ళీ మమ్మల్ని గెలికితే మీరు చేసిన పనులు అన్ని బయటకు వస్తాయి.
తెలంగాణలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే కాబట్టి మీ ఓటుబ్యాంకును మీరే గల్లంతు చేసుకోవద్దు.
26/01/2025
26/01/2025
పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన రాజ్యాంగం అమలుకు వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
505331