Perabathula Rajasekharam
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ || East - West Godavari Graduate MLC
12/06/2026
సమ్మక్కం, అభివృద్ధి, సంక్షేమం.. కూటమి పాలనకు నేటితో 2 ఏళ్లు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్‌కు మద్దతుగా, కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
నాటి ప్రజా తీర్పే... నేటి అభివృద్ధికి పునాది.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇదే ప్రజల నమ్మకానికి నిదర్శనం.
10/06/2026
10/06/2026
కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణం కోసం 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని 66 సంవత్సరాల లీజుకు కేటాయించింది. ఈ నేపథ్యంలో కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో కూటమి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్ జగ్గంపేట శాసనసభ సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు, కాకినాడ సిటీ శాసనసభ సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) గారు, ప్రత్తిపాడు శాసనసభ సభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి శాసన మండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు, మాజీ మంత్రి శ్రీ చిక్కల రామచంద్రరావు గారు, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు శ్రీ నిమ్మకాయల రంగనాథ్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి సుంకర పావని గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి తుమ్మల సునీత గారు, కాకినాడ సిటీ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లిపూడి వీరు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పెంకె శ్రీనివాస్ బాబా గారు, శ్రీ వాసిరెడ్డి ఏసుదాసు (వై.వి. దాసు)గారు, శ్రీ మేఖా లక్ష్మణ మూర్తి గారు, మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజలకు మరింత చేరువగా ఉండేలా, ఆధునిక సదుపాయాలతో కూడిన జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నాయకులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
10/06/2026
10/06/2026
ఈరోజు జి. వేమవరం గ్రామంలో సాధనాల వారి (సిరి వదన) రజస్వల కార్యక్రమానికి హాజరైన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి శాసన మండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు.
10/06/2026
10/06/2026
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నేడు BVC అక్షర్ జూనియర్ కాలేజీ ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ కోనసీమ విద్యారంగ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలవనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు, అమలాపురం శాసనసభ సభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు,ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి శాసన మండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు, AMUDA చైర్మన్ శ్రీ అల్లాడి సోంబాబు గారు, యువ నాయకులు శ్రీ మెట్ల రమణబాబు గారు కలిసి కళాశాలను ప్రారంభించారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ గొప్ప విద్యా సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. అనంతరం అతిథులను కాలేజీ యాజమాన్యం ఘనంగా సత్కరించింది.
📚 విద్యే అభివృద్ధికి పునాది... యువతకు నాణ్యమైన విద్య అందించే ప్రతి ప్రయత్నం సమాజ ప్రగతికి దోహదం చేస్తుంది.
09/06/2026
09/06/2026
Paper cuttings
08/06/2026
08/06/2026
ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీ సానా సతీష్ బాబు గారు, శ్రీ భాష్యం రామకృష్ణ గారు, మరియు శ్రీ చింతకాయల విజయ్ గారి నామినేషన్ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి శాసన మండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు పాల్గొన్నారు.
అమరావతి చేరుకున్న పేరాబత్తుల రాజశేఖరం గారు ముందుగా కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మంత్రి శ్రీ పార్థసారథి గారు, ఎంపీ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వీఎస్ఎన్ వర్మ గారు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు శ్రీ నిమ్మకాయల రంగనాథ్ గారు మరియు ఇతర నాయకులు & కార్యకర్తలు తదితరులతో కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
07/06/2026
07/06/2026
ఈరోజు చీడికాడ మండలం, చీడిపల్లి గ్రామంలో వేచలపు వారి (గాయత్రి) రజస్వల కార్యక్రమానికి హాజరైన ముమ్మిడివరం నియోజకవర్గ శాసన సభ్యులు & ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారు మరియు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి శాసన మండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు.
07/06/2026
07/06/2026
నేడు ఎలమంచిలి నియోజకవర్గంలోని, అచ్యుతాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారి అధ్యక్షతన నియోజవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఎలమంచిలి నియోజకవర్గ పరిశీలకులు మరియు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి శాసన మండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు హాజరయ్యారు. ఈనెల 14 నుండి వచ్చే నెల 15 వరకు SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం జరగనుందని, ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు,యూనిట్ ఇన్చార్జులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్ లిస్ట్ స్థితిగతులపై నిరంతరం పరిశీలించాలని, SIR ప్రక్రియపై మండల అధ్యక్షులుకు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్చార్జిలకు ఈ కార్యక్రమంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఈ కార్యక్రమమును ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో ఈ ప్రక్రియను కొనసాగించాలని, నెలరోజులపాటు ఈ కార్యక్రమం జరగనుందని, ఈ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ కార్యాలయంకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాధవ కార్పొరేషన్ డైరెక్టర్ ధూళి రంగనాయకులు , గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ డొక్కా నాగభూషణం, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి శివ అప్పారావు, మండల అధ్యక్షులు పీల తులసీరామ్, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు, ప్రధాన కార్యదర్శులు గింజి శ్రీనివాసరావు, ఆడారి ఆదిమూర్తి, కర్రెడ్ల ఈశ్వరరావు, కాండ్రేగుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
07/06/2026
07/06/2026
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యునిగా వరుసగా రెండోసారి ఎన్నికైన శ్రీ సనా సతీష్ బాబు గారికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి శాసన మండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
07/06/2026
07/06/2026
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన శ్రీ సనా సతీష్ బాబు గారు, శ్రీ భాష్యం రామకృష్ణ గారు, శ్రీ చింతకాయల విజయ్ గారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి శాసన మండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు.
ప్రత్యేకించి, శ్రీ సనా సతీష్ బాబు గారు రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఎంపిక కావడం ఆయన పార్టీ పట్ల చూపిన అంకితభావానికి, రాజకీయ ప్రావీణ్యానికి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రదర్శించిన చొరవకు నిదర్శనం. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషికి ఇది తగిన గుర్తింపు.
అలాగే, శ్రీ భాష్యం రామకృష్ణ గారు మరియు శ్రీ చింతకాయల విజయ్ గారు రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక కావడం పార్టీ శ్రేణులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. వివిధ రంగాల్లో వారి అనుభవం, పార్టీ అభివృద్ధికి చేసిన సేవలు, ప్రజలతో మమేకమైన తీరు వారికి ఈ గౌరవాన్ని తీసుకువచ్చాయి.
ముగ్గురు నాయకులు రాజ్యసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, అభివృద్ధి లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపిస్తూ రాష్ట్ర ప్రగతికి మరింత తోడ్పాటు అందిస్తారనే నమ్మకం ఉంది.
ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు నాయకులకు మరోసారి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు...!! 💛✌️
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Kakinada
533001