Life Is Beutiful
I Love My India
03/12/2025
ఆడతనం అంటే ఏమిటి?
ఆడతనం అనేది బాహ్య శరీరం కాదు
కనిపించే శరీర అవయవాలు కాదు
● ఆడ తనం అంటే స్త్రీత్వం ●
ప్రేమ,
మృదుత్వం,
ధైర్యం,
తల్లి భావం,
సహనం,
అనుభూతి
ఈ సమష్టి
అమ్మతనం
ఓర్పు
సహజత్వం
ఆడతనం అంటే సృష్టి
అనుకువ
సిగ్గు
బిడియం
నడక
నడక
స్త్రీ శరీరంలో శిశువును సృష్టించే శక్తి ఉన్నట్లు,
ఆమె మనసులో కూడా
భావాలను
సంబంధాలను
కుటుంబాన్ని ప్రేమను శాంతిని
సృష్టించే శక్తి ఉంటుంది
ఆమె మృదువుగా ఉంటుంది.
కానీ అది బలహీనత కాదు.
ఆమె అస్తమించని ఓర్పు బలం.
ఎవరినైనా గాయపరచకుండా గెలవగల శక్తి ఆడతనం.
ఆమె సహజంగా ప్రేమను పంచుతుంది.
ఇది తల్లి ప్రేమ,
భార్య ప్రేమ,
చెల్లి ప్రేమ,
స్నేహితి ప్రేమ
ఈ ప్రేమే కుటుంబానికి పునాది.
గుణ సౌందర్యం
ఆత్మసౌందర్యం,
మానవత,
ప్రేమ,
ఓపిక,
నిబద్ధత ఇవే నిజమైన ఆడతనం.
ఆమె వినగలదు.
ఆమె అనుభూతి చెందగలదు.
ఆమె మాటలో కన్నా హృదయం ఎక్కువ మాట్లాడుతుంది.
ఇల్లు ఆమెతోనే ఇల్లు అవుతుంది.
కుటుంబంలో ప్రేమ, పరస్పరత, శాంతి ఇవి ఆమె చేతుల్లోనే నిర్మాణం అరుగుతాయి.
ఆడతనానికి బాహ్య లక్షణాలు కాదు అంతర్గత వెలుగు
సౌందర్యం, దుస్తులు, ఆకృతి ఇవేవీ ఆడతనం కాదు.
● మగ తనం అంటే ఏమిటి? పురుషత్వం ●
మగతనం అనేది రౌడితనం కాదు
మీసాలు తిప్పడం కాదు
కండలు చూపించడం కాదు
తొడలు కొట్టడం కాదు
( మగ తనం అంటే )
వీరత్వం
శూరత్వం
నిలబడి ఉండే ధైర్యం.
బాధ్యత తీసుకునే మనస్తత్వం.
రక్షించే శక్తి.
న్యాయం కోసం నిలబడే స్వభావం.
అందుకే మగతనం ఒక స్థిరత్వ శక్తి.
భయపడకుండా కర్తవ్యం తీసుకోవడం.
ఇది నా పని అని నిలబడటం.
ఇది నిజమైన పురుషత్వం.
మాట ఇస్తే మాట మీద నిలబడడం
తనను ఆశ్రయించిన వారికి రక్షణ కల్పించడం
సతీశక్తిని, ఇంటిని, పిల్లలను, కుటుంబాన్ని,
సత్యాన్ని రక్షించడం
ధర్మాన్ని కాపాడడం
న్యాయం చేయడం
నీతిని ఆచరించడం
దాడి చేయడం మగతనం కాదు
అవసరమైనప్పుడు రక్షించడం మగతనం.
ధైర్యంగా నిలబడటం
ఒత్తిడి వచ్చినా సరే,
అధికారం ఎదురైనా సరే,
సత్యం ముందు తలవంచకుండా నిలబడగల వ్యక్తే నిజమైన మగవాడు.
క్రమశిక్షణ
తన భావాలు, కోపం, వాంఛలు, బలాలు ఇవన్నీ నియంత్రించగల శక్తి.
తనను తాను నియంత్రించుకోగల వ్యక్తే
ఇతరులను రక్షించగలడు.
నిలకడ
నిర్ణయం
పరిస్థితులు ఎంత కష్టమైనా
నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పగల సామర్థ్యం.
ప్రేమలో స్థిరత్వం
మగవాడు ప్రేమిస్తే
మాట కాదు, భుజంగా నిలబడాలి.
మద్దతు ఇవ్వాలి.
నిబద్ధత చూపాలి.
ఆడతనం మగతనం పరస్పర విరుద్ధాలు కాదు,
పరస్పర స్పందనలు
ఇవి రెండూ కలిస్తేనే జీవితం సంపూర్ణం.
ఆడతనం శాంతి ఇస్తుంది.
మగతనం స్థిరత్వం ఇస్తుంది.
ఆడతనం ప్రేమ ఇస్తుంది.
మగతనం రక్షణ ఇస్తుంది.
ఆడతనం భావాల లోతు.
మగతనం నిర్ణయాల బలం.
జీవితం అనే పర్యావరణం, ప్రకృతి పురుష సమ్మేళనం
అందం అన్న మాట వినడమే గాని
ఇంతవరకు చూసిందే లేదు
అసలు అందమంటే💕✨
ఇంత అందంగా ఉంటుందని
నిను చూసే దాక తెలీదు💕✨
అందానికి ప్రతిబింబం నువ్వని
నిన్ను తలిచే దాక తెలీదు
లోకంలో ఉన్న అందమంతా
ఏకమైన నీకు సాటిరాదని💕✨
నిను ఆరాదించే దాక తెలీదు
అందమంటే నీకు మాత్రమే సొంతమని
నిను మనసుతో చూసేదాక తెలీదు
ఓ అందమైన పుత్తడిబొమ్మ💕✨
అందగా విరగబూసిన
రంగురంగుల పూలకొమ్మ💕✨
నీకోసం
ఓ అందమైన కవిత రాయాలని💜✨
నీ ప్రతి జ్ఞాపకం
ఒక మధుర కావ్యంగా❤✨
మలచాలని ప్రయత్నిస్తూనే ఉన్నా....
నీ మధురోహల పరిమళాలు💚✨
మనసును మరో లోకంలో
విహరింప చేస్తుంటే🧡✨
గిలిగింతలు పెట్టే చల్లని గాలి
నీ ఊసులేవో వినిపిస్తుంటే
రాచిలక నీపేరు పదే పదే పలుకుతుంటే
పరిమళించే వెన్నెలలా❤✨
పలకరించే మల్లికలా
నీ మనసు పలికే మౌనగీతం💙✨
నా మనసులో ప్రణయవీణ మ్రోగిస్తుంటే
అక్షరాలు సప్తస్వరాలుగా
ఇరు హృదయాలలో స్పందించే 💜✨
హృదయరాగమైతే
ఇదే నీ హృదయంపై ❤✨
నేను రచించే
నా హృదయకావ్యం💚✨
I got 10 reactions and comments on one of my posts last week! Thanks everyone for your support! 🎉
02/05/2025
మనతో
ఏ సంబంధం లేని వ్యక్తులు
అప్తులు అవుతుంటే ,
మనతో
అన్నీ బంధాలు వున్నా వాళ్లు
మాత్రం బద్దశత్రవులు అవుతున్నారు!
మనిషిలో
అణువనువు స్వార్ధం,
డబ్బు ప్రవేశించాక
ఏ బంధాలు లేవు
అన్నీ ఆర్థిక సంబంధాలే..!
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Address
Hyderabad
500086
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |
| Sunday | 9am - 5pm |